Devara – Princy George : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా ఇటీవల రిలీజయి 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీకాంత్ చెల్లెలుగా ఓ కళ్ళు లేని అమ్మాయి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎన్టీఆర్ ని కూడా అన్న అని పిలుస్తుంది. ఓ సీన్ లో ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా..?
దేవర సినిమాలో కళ్ళు లేని అమ్మాయి పాత్రలో నటించి ఎన్టీఆర్ తో పాటు డ్యాన్స్ వేసిన నటి అసలు పేరు ప్రిన్సీ జార్జ్. తమిళనాడుకు చెందిన నటి. ఇప్పటికే తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసింది. పలు షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. తునివు, జిగర్తాండ 2, బాలి, తంగలాన్.. లాంటి పలు సినిమాల్లో నటించింది.
తెలుగులో మొదటిసారి దేవర సినిమాలో నటించింది ప్రిన్సీ జార్జ్. దేవర రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా గురించి, సినిమా షూటింగ్ అనుభవాలు, ఎన్టీఆర్ తో షూట్ ఫొటోలు తన సోషల్ మీడియాలో పంచుకుంది. దేవరలో గుడ్డి అమ్మాయి పాత్రలో మెప్పించిన ఈ తమిళ భామ మరి ఫ్యూచర్ లో మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.