Sundeep Kishan : ఎవరికైనా ఫుడ్ కోసం కష్టాలు పడితే.. మా రెస్టారెంట్‌కి వచ్చి ఫ్రీగా తీసుకెళ్లండి.. సందీప్ కిషన్ ట్వీట్..

తాజాగా సందీప్ కిషన్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Sundeep Kishan : ఎవరికైనా ఫుడ్ కోసం కష్టాలు పడితే.. మా రెస్టారెంట్‌కి వచ్చి ఫ్రీగా తీసుకెళ్లండి.. సందీప్ కిషన్ ట్వీట్..

Sundeep Kishan Tweet on Free Food for Poor People goes Viral

Updated On : October 22, 2024 / 8:55 AM IST

Sundeep Kishan : మన హీరోలు ఓ పక్క సంపాదిస్తూనే మరో పక్క మంచి పనులు చేస్తారు. హీరో సందీప్ కిషన్ కూడా ఎప్పట్నుంచో ఓ మంచి పని చేస్తున్నాడు. సందీప్ కిషన్ కి వివాహ భోజనంబు అనే రెస్టారెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి బ్రాంచ్ రెస్టారెంట్స్ నుంచి రోజూ ఉచితంగా 50 మందికి ఫుడ్ పంపిస్తాడు. అవసరం ఉన్న పేదలకు, ఆశ్రమాలకు సందీప్ డైలీ తన ఏడు రెస్టారెంట్స్ నుంచి ఆల్మోస్ట్ 350 మందికి రోజూ ఉచితంగా భోజనం పెడుతున్నాడు సందీప్ కిషన్.

Also Read : Prabhas : అడగందే అమ్మయినా పెట్టదు.. అడక్కపోయినా అమ్మకంటే ఆప్యాయంగా ప్రభాస్ పెడతాడు.. డైరెక్టర్ కామెంట్స్..

తాజాగా సందీప్ కిషన్ ఈ విషయంపై వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సందీప్ కిషన్ వివాహ భోజనంబు టీమ్ పేదలకు భోజనం పంచుతున్న పలు ఫొటోలు షేర్ చేసి.. వివాహ భోజనంబు చేస్తున్న మంచి పనికి నేను గర్వపడుతున్నాను. ఎవరైనా ఫుడ్ కోసం కష్టపడితే మీకు దగ్గర్లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ప్యాకెట్ ని ఫ్రీగా తీసుకోండి అని ట్వీట్ చేసాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు సందీప్ ని అభినందిస్తున్నారు.