Do You Know These Star Directors Remuneration
Directors : సినిమా చేసే హీరోలే వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే కథతో కుస్తీలు పడి హీరోల్ని మెప్పించి, ప్రొడ్యూసర్లను సంపాదించి సినిమాని సెట్స్ మీదకి తీసికెళ్లి, సక్సెస్ చేసే మాకెంత రెమ్యునరేషన్ ఉండాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు డైరెక్టర్లు. పాన్ ఇండియా లెవల్ సినిమాలు చెయ్యడంతో డైరెక్టర్లు కూడా మిడ్ రేంజ్ సినిమా బడ్జెట్ అంత రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో హీరో రేంజ్ కి ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు డైరెక్టర్లు. హీరోల్ని ఆ రేంజ్ లో చూపించేది మేమే అంటూ భారీ రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే హీరోల తర్వాత మేజర్ ప్రొడక్షన్ కాస్ట్ డైరెక్టర్ల అకౌంట్ లోకే వెళుతోంది.
ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవల్లో ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRR కి 50కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. దాంతో పాటు RRR ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుని 100 కోట్లకు పైగా దక్కించుకున్నారని టాక్. ఈ 100కోట్ల రెమ్యూనరేషన్ మొన్నమొన్నటి వరకూ ఒకరిద్దరు హీరోలకి తప్ప తెలుగులో ఎవరికీ లేదంటే రాజమౌళి ఏ రేంజ్ డైరెక్టరో అర్దం చేస్కోవచ్చు. మహేశ్ తో చేస్తున్న సినిమాకి రాజమౌళి అసలు రెమ్యూనరేషనే తీసుకోవడం లేదని, ప్రాఫిట్స్ లో షేర్ మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన రాజమౌళికి కనీసం 150 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ కింద దక్కొచ్చని లెక్కలేస్తున్నారంతా.
పుష్పతో ఓ రేంజ్ రెస్సాన్స్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పుడు హీరోల్ని డామినేట్ చేసేంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్పకి సుకుమార్ 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి 1870 కోట్లు కలెక్ట్ చెయ్యడంతో 100కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకు కూడా మినిమం 100కోట్ల రెమ్యూనరేషన్ కోట్ చేస్తున్నారు సుకుమార్.
ఒక్క హిట్ తో లైమ్ లైట్లోకొస్తున్నారు. వరసగా సాలిడ్ సక్సెస్ లతో సూపర్ డైరెక్టర్లైపోతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే అయినా ఇంపాక్ట్ మాత్రం నెక్ట్స్ లెవల్. వేలకోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 100 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్. అయితే రెమ్యునరేషన్ కంటే కూడా సందీప్ రెడ్డి తన సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కాబట్టి దాంట్లో కూడా లాభాలు గట్టిగానే వస్తాయని అంటున్నారు.
తెలుగులో కల్కి లాంటి నెక్ట్స్ లెవల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. నాగ్ అశ్విన్ థన్ ఆఫ్యామిలీ బ్యానర్ లోనే చేసేది కాబట్టి ప్రాఫిట్స్ తో కలిపి 100 కోట్ల వరకు వస్తాయని తెలుస్తుంది.
Also Read : Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. మళ్ళీ ముద్దులతో రౌడీ హీరో..
తెలుగులోనే కాదు వేరే పరిశ్రమలలో కూడా కొంతమంది దర్శకులు ఈ రేంజ్ లో భారీ రెమ్యునరేషన్స్ తీసుకునే దర్శకులు ఉన్నారు. తమిళ్ లో ఎన్ని సినిమాలు చేసినా బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో రెమ్యూనరేషన్ కూడా నెక్ట్స్ లెవల్ కి పెంచేశారు అట్లీ. ఇప్పుడు 50 నుంచి 60 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అట్లీ రెమ్యూనరేషన్ ఎక్కువని సినిమాలు చెయ్యడానికి కూడా ఆలోచిస్తున్నారట నిర్మాతలు. అల్లుఅర్జున్ -అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు అట్లీ దాదాపు 100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ రెమ్యూనరేషన్ సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్ కన్నా ఎక్కువే. అయితే బన్నీ లాంటి స్టార్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు.
బ్యాక్ టూ బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీస్కుంటున్నారు. సలార్, కెజిఎఫ్ సినిమాలతో వెయ్యి కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీని మ్యాసివ్ గా తెరకెక్కిస్తున్నారు.
లోకేశ్ కనగరాజ్.. తమిళ్ లోనే కాదు సౌత్ మొత్తం సాలిడ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న లోకేశ్ అంతకుముందున్న 10 కోట్ల రెమ్యూనరేషన్ నుంచి ఇప్పుడు 25 కోట్లకి పెంచేశారని తెలుస్తుంది. సాలిడ్ కమర్షియల్ హిట్స్ కొట్టిన లోకేశ్ ప్రస్తుతం కూలీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్ లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ చాలా మంది హీరోలకే లేదు. అలాంటిది లోకేశ్ కూలీ మూవీకి రెమ్యూనరేషనే 25 కోట్లు తీస్కుంటున్నారట.
సినిమాల విషయంలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న డైరెక్టర్ నెల్సన్. రజనీకాంత్ తో నెల్సన్ చేసిన జైలర్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే అంతకు ముందు 10 నుంచి 15కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నెల్సన్ ఇప్పుడు 25 కోట్లకి రీచ్ అయ్యారు. తమిళ్ లో కూడా హీరోల రెమ్యూనరేషన్ రోజు రోజుకీ పెరగడంతో డైరెక్టర్లు కూడా అదే రేంజ్ లో పెంచుకుంటూ పోతున్నారు.