Pruthvi : అసలైన సంక్రాంతి యాక్షన్ హీరో అతనే.. ఎవరతను?

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి యాక్షన్ హీరో పృథ్వినే. పండక్కి రిలీజైన మూడు సినిమాల్లో తన హవా చూపించారు. ఇంతకీ ఎవరీ పృథ్వి? అంటే..

Pruthvi

Stunt Choreographer Pruthvi : ఈసారి సంక్రాంతికి చాలానే సినిమాలు రిలీజయ్యాయి. ఈ పండక్కి నిజంగా యాక్షన్ హీరో ఎవరు అంటే?  స్టంట్ కొరియోగ్రాఫర్ పృథ్వి. సంక్రాంతికి రిలీజైన మూడు సినిమాలకు స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేసారు పృథ్వి.

Also Read: తెలుపుచీరలో తళతళలాడుతున్న ధన్య బాలకృష్ణ..

సంక్రాంతి అంటేనే సినిమా పండగ. ఈ పండక్కి రిలీజయ్యే సినిమాలపై భారీ అంచనాలుంటాయి. హీరోలు సైతం ఈ పండగకి తమ సినిమా విడుదల ఉండాలని కోరుకుంటారు. ఎప్పటిలాగ ఈసారి కూడా చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలా రిలీజైన వాటిలో మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ  హనుమాన్, నాగార్జున నా సామిరంగ ఉన్నాయి. కాగా వీటిలో మూడు సినిమాలకు ఒకరే స్టంట్ మాస్టర్‌గా పనిచేసారు. అసలైన సంక్రాంతి యాక్షన్ హీరో అంటూ అందరి అభినందనలు పొందుతున్నారు. అతనే స్టంట్ కొరియోగ్రాఫర్ పృథ్వి.

Also Read : ఆమెతోనే ప్రశాంత్ వర్మ సూపర్ హీరోయిన్ మూవీ.. ‘జై హనుమాన్’ తర్వాత?

పృథ్వి గతంలో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, తీస్ మార్ ఖాన్, చోర్ బజార్, రొమాంటిక్ సినిమాలకు  స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ ఏడాది  సూపర్ హిట్ అయి రికార్డులు బద్దలు కొడుతున్న హనుమాన్ మూవీలో ఒక సీన్ తప్ప మిగిలిన భారీ యాక్షన్ సీన్స్‌ని కొరియోగ్రాఫ్ చేసారు. సైంధవ్ సినిమాలో ఇంటర్వెల్‌కి ముందున్న సీన్స్, నా సామిరంగ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా పృథ్వి డైరెక్ట్ చేసారు. విడుదలకు సిద్ధమవుతున్న ఊరి పేరు భైరవకోన, Mr. బచ్చన్‌తో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు పృథ్వి.