Gnaneswari Kandregula : ఆమెతోనే ప్రశాంత్ వర్మ సూపర్ హీరోయిన్ మూవీ.. ‘జై హనుమాన్’ తర్వాత?
ఓ ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.

Gnaneswari Kandregula will play lead role in Prashanth Varma Super Women Movie after Jai Hanuman
Gnaneswari Kandregula : ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తన మొదటి సినిమా ‘అ’ నుంచి సినీ పరిశ్రమలో అందరిని మెప్పించి కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు , కొత్త ప్రయోగాలు చేస్తాడు అని తెలిసేలా చేసాడు. ఇప్పుడు హనుమాన్(Hanuman) సినిమాతో ఇండియన్ వైడ్ ఆడియన్స్ ని మెప్పించి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ ఖర్చులో మంచి అవుట్ పుట్ ఇచ్చి హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించి అందర్నీ మెప్పించాడు.
హనుమాన్ సినిమా 200 కోట్ల కలెక్షన్స్ దాటి దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపులో ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా ప్రకటించాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టానని తెలిపాడు. ప్రశాంత్ వర్మ దాదాపు 12 సూపర్ హీరో సినిమాలు తీస్తానని, ఆల్రెడీ ఆరు సినిమాలకు రైటింగ్ వర్క్ జరుగుతుందని, ఒక సినిమా షూటింగ్ లో ఉందని, అందులో ఓ ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.
అయితే ఆ ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా చేసేది జ్ఞానేశ్వరి కాండ్రేగులతో అని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా జ్ఞానేశ్వరి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లిచూపులు అనే షోతో ఫేమ్ తెచ్చుకున్న జ్ఞానేశ్వరి ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవల మంత్ ఆఫ్ మధు, నీ జతగా, మాయలో, మిస్టర్ అండ్ మిస్.. సినిమాలతో మెప్పించింది. పలు సిరీస్ లలో కూడా నటిస్తుంది. జ్ఞానేశ్వరి బోల్డ్ సీన్స్ కి కూడా ఓకే చెప్తుంది. ఆల్రెడీ పలు సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేసి మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.
Also Read : Trivikram : ‘గుంటూరు కారం’ అయిపోయింది.. త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి? ఆ ముగ్గురి హీరోల్లో ఎవరితో సినిమా?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తీయబోయే సూపర్ వుమెన్ సినిమాలో నేనే లీడ్ రోల్ చేస్తున్నాను అని తెలిపింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కొంతమంది జ్ఞానేశ్వరి సూపర్ హీరోయిన్ గా సెట్ అవుతుందా అసలు అంటుంటే, చిన్న హీరోయిన్ తో చేస్తేనే అంచనాలు ఉండవు, బడ్జెట్ తక్కువ అవుతుంది అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ ఈ సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి. ఇక ప్రశాంత్ వర్మ లైనప్ చూస్తే.. అధీరా, జై హనుమాన్, బాలకృష్ణతో సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు సూపర్ హీరో సినిమాలు, ఓ సూపర్ హీరోయిన్ సినిమా ఉన్నాయి. మరి వీటిల్లో ఏది ముందు వస్తుందో చూడాలి. మొత్తానికి ప్రశాంత్ వర్మ ఓ పదేళ్లకు సరిపడా లైనప్ సెట్ చేసి పెట్టుకున్నాడు.