Trivikram : ‘గుంటూరు కారం’ అయిపోయింది.. త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి? ఆ ముగ్గురి హీరోల్లో ఎవరితో సినిమా?

గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడని ఆయన అభిమానుల్లో, టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.

Trivikram : ‘గుంటూరు కారం’ అయిపోయింది.. త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి? ఆ ముగ్గురి హీరోల్లో ఎవరితో సినిమా?

Trivikram Srinivas next Movie after Guntur Kaaram Who is the Hero in Trivikram Next Film

Updated On : January 24, 2024 / 11:35 AM IST

Trivikram Srinivas : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవలే మహేష్ బాబు(Mahesh Babu) ‘గుంటూరు కారం'(Guntur Kaaram) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి ఇప్పటికే 215 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏంటి అని ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమాల్లో మైనస్ లు ఏమైనా ఉన్నా అతని మాటలతోనో, ఇంకేదో మ్యాజిక్ చేసి ప్రేక్షకులని మెప్పిస్తాడు. కానీ గత కొన్ని సినిమాల నుంచి త్రివిక్రమ్ ఒకే మూసలో సినిమాలు తీస్తున్నాడని, ఒకే రకం క్యారెక్టర్స్ తో వస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. ఒక కంఫర్ట్ జోన్ చూసుకొని త్రివిక్రమ్ అందులోనే ఉంటున్నాడని, దాంట్లోంచి బయటకి వచ్చే డేర్ చేయలేకపోవుతున్నాడని ఇటీవల పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఒకప్పటిలా త్రివిక్రమ్ మ్యాజిక్ అంతగా కనపడట్లేదని కూడా అంటున్నారు.

ఇప్పుడు గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడని ఆయన అభిమానుల్లో, టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. గతంలో అల్లు అర్జున్(Allu Arjun) తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి పుష్ప 2 అయ్యాక బన్నీ త్రివిక్రమ్ కి డేట్స్ ఇస్తాడా లేదా వేరే సినిమాలు చేస్తాడా అనేది క్లారిటీ లేదు. అలాగే గతంలో ఎన్టీఆర్ తో ‘అయిననూ పోయిరావలెను హస్తినకు’ అనే ఓ సినిమాని ప్రకటించారు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఎన్టీఆర్ కి అరవింద సమేత వీరరాఘవ లాంటి హిట్ సినిమా ఇచ్చిన త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మళ్ళీ సినిమా చేస్తాడా అంటే ఎన్టీఆర్ వరుసగా దేవర రెండు పార్టులు, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్లో పెట్టాడు. సో ఇప్పట్లో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమాకు ఛాన్స్ లేనట్టే.

Also Read : Devara : ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా? దేవర డేట్‌కి ఆ రెండు సినిమాలు?

గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ రామ్ పోతినేని లేదా నానితో సినిమా తీస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ కి లైఫ్ ఇచ్చింది రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ అని అందరికి తెలిసిందే. రవి కిషోర్ ఎప్పట్నుంచో రామ్ ని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయించాలని అనుకుంటున్నట్టు పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు కూడా. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ అల్లు అర్జున్, రామ్, నానిలలో ఎవరితో సినిమా చేస్తారో చూడాలి. మరో వైపు పవన్ కళ్యాణ్ కి త్వరగా అయిపోయి డబ్బులు వచ్చే రీమేక్ ప్రాజెక్ట్స్ సెట్ చేసి వాటికి కథనం, మాటలు రాస్తున్నారు. నెక్స్ట్ సినిమా తీసే గ్యాప్ లో పవన్ కి ఇంకో రీమేక్ సినిమా సెట్ చేసినా చేయొచ్చు గురూజీ.