Lathaj Mangeshkar
Lata Mangeshkar : గాన కోకిల, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనాతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు ముగిసాయి. ఆమె మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సంతాపం తెలియచేస్తున్నారు. ఆమె మరణంతో అందరూ ఆమె గురించి తెలుసుకోవాలని సెర్చ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని చాలా మందికి సందేహం. అయితే దీనిపై లతా మంగేష్కర్ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అడగగా.. లతా మంగేష్కర్ దీనిపై సమాధానమిస్తూ.. ”జీవితంలో ప్రతిదీ దేవుడి నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా సమాధానం మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.” అంటూ ఆమె చెప్పారు. అయితే ఈ ఇంటర్వ్యూ జరిగే సమయానికి లతాజీ వయసు 80 సంవత్సరాలు పైనే.
Lata Mangeshkar : ముగిసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు
అలాగే మరో ఇంటర్వ్యూలో..”కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడంతో తండ్రి చనిపోయాక 13ఏళ్ల వయసు నుంచే కుటుంబ బాధ్యతని భుజాన వేసుకున్నాను. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ నాకున్న బాధ్యతల వల్ల కుదరలేదు” అని తెలిపారు. పెళ్లి చేసుకోకుండానే జీవితం చివరి వరకు ఉన్నారు లతాజీ.