Lata Mangeshkar : ముగిసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు

ముంబైలోని శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. లతా మంగేష్కర్‌ అంత్యక్రియల్లో.........

Lata Mangeshkar :  ముగిసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు

Lathaji

Lata Mangeshkar :  గాన కోకిల, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనాతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మరణంతో యావత్‌ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేస్తున్నారు.

 

ఆమె పార్థివ దేహాన్ని ఇవాళ ఉదయం బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. అక్కడే సాయంత్రం వరకు ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సాయంత్ర ఆరుగంటలకు అంతిమ యాత్రని ఇంటి వద్ద నుంచి శివాజీ పార్కు వరకు తీసుకెళ్లారు. శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల నుండి ఈ కార్యక్రమం జరిగింది.

Lata Mangeshkar : భారతీయ సినిమాకు ఆమె చేసిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది : తమిళిసై సౌందరరాజన్

ముంబైలోని శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. లతా మంగేష్కర్‌ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అమితాబ్, షారుఖ్.. లాంటి బాలీవుడ్ సినీ ప్రముఖులు, సచిన్ టెండూల్కర్.. మరి కొంతమంది క్రికెటర్లు.. చాలా మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా లతాజీకి నివాళులు అర్పించారు.

Lata Mangeshkar : ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు : నందమూరి బాలకృష్ణ

అందరి సమక్షంలో వారి ఆచారాల ప్రకారం లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. గాన కోకిల భువి నుంచి దివికి ఎగిసింది. ఇంతటితో భారత సినీ సంగీత పరిశ్రమలో ఒక శకం ముగిసింది. ఆమెని ప్రజలంతా ఆమె పాటలతో ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారు.