Ram Charan : మ‌హేష్‌, ప్ర‌భాస్ ఇద్ద‌రిలో చ‌ర‌ణ్ ఎవ‌రితో మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుకుంటున్నాడో తెలుసా?

ఒక వేళ ప్ర‌భాస్, మ‌హేశ్‌బాబుల‌తో మ‌ల్టీస్టార‌ర్ చేయాల్సి వ‌స్తే ఎవ‌రిని ఎంచుకుంటావ్ అనే ప్ర‌శ్న చ‌ర‌ణ్‌కు ఎదురైంది.

Do you know with whom Charan wants to do a multi-starrer between Mahesh and Prabhas

ఒక‌ప్పుడు తెలుగులో మ‌ల్టీ స్టార‌ర్‌ల ట్రెండ్ ఎక్కువ‌గా ఉండేది. ఇటీవ‌లే ఈ ట్రెండ్ మ‌ళ్లీ క‌నిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టించ‌గా ఈ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కాగా.. మ‌రోసారి చ‌ర‌ణ్‌కు మ‌ల్టీ స్టార‌ర్ చేసే ఆలోచ‌న ఉందా? ఒక వేళ ప్ర‌భాస్, మ‌హేశ్‌బాబుల‌తో మ‌ల్టీస్టార‌ర్ చేయాల్సి వ‌స్తే ఎవ‌రిని ఎంచుకుంటావ్ అనే ప్ర‌శ్న చ‌ర‌ణ్‌కు ఎదురైంది. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ చెప్పిన సమాధానం వైర‌ల్‌గా మారింది.

బాల‌య్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 షో ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో విజ‌య‌వంతంగా దూసుకుపోతుంది. ఇప్ప‌టికే ఎనిమిది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. ఇక తొమ్మిదో ఎపిసోడ్‌కు గేమ్ ఛేంజ‌ర్ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అతిథిగా వ‌చ్చారు. చ‌ర‌ణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు, యంగ్ హీరో శ‌ర్వానంద్ సైతం వ‌చ్చారు.

Game Changer Song : గేమ్ ఛేంజర్ నుంచి చరణ్, అంజలి ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది.. ‘అలికి పూసిన అరుగు మీద.. ‘

ఈ క్ర‌మంలో చ‌ర‌ణ్‌ను బాల‌య్య ఇరుకున పెట్టే కొన్ని ప్ర‌శ్న‌లు అడిగాడు. స‌మంత‌, కియారా అద్వానీ, అలియా భ‌ట్‌ల‌లో ఉత్త‌మ న‌టి ఎన్నుకోమ‌ని అడిగారు. ఇందుకు స‌మంత అంటూ చ‌ర‌ణ్ స‌మాధానం చెప్పాడు. మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ చేసే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రితో చేస్తావు అంటూ మ‌రో ప్ర‌శ్న అడిగారు బాల‌య్య‌. ఇందుకు మ‌హేశ్ బాబు అని చ‌ర‌ణ్ స‌మ‌ధానం చెప్పారు. ఇక్క‌డ‌.. చ‌ర‌ణ్, ప్ర‌భాస్‌లు మంచి స్నేహితులు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ షోలోనే ప్ర‌భాస్‌కు కాల్ చేసి మాట్లాడాడు చ‌ర‌ణ్.

రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ క‌థానాయిక‌. అంజ‌లి, ఎస్ జే సూర్య‌, శ్రీకాంత్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Sreeja – Sania Mirza : చిరంజీవి కూతురు శ్రీజ బిజినెస్ లో సానియా మీర్జా పెట్టుబడులు.. పిల్లల కోసం..