Dongalunnaru Jagratha Trailer: అడ్డంగా దొరికిపోయిన MM కీరవాణి కొడుకు శ్రీ సింహా.. “దొంగలున్నారు జాగ్రత్త” ట్రైలర్!
ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా శ్రీ సింహా "మత్తు వదలారా" సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. సింహా ఇప్పుడు "దొంగలున్నారు జాగ్రత్త" అనే కొత్త సినిమాతో రాబోతుండగా, తెలుగులో...

Dongalunnaru Jagratha Movie Trailer Released
Dongalunnaru Jagratha Trailer: ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా శ్రీ సింహా “మత్తు వదలారా” సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. భిన్నమైన స్క్రీన్ ప్లే కథను ఎంచుకొని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సింహ, ఆ తరువాత కూడా “తెల్లవారితే గురువరం” వంటి విభిన్నమైన సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సింహా ఇప్పుడు “దొంగలున్నారు జాగ్రత్త” అనే కొత్త సినిమాతో రాబోతుండగా, తెలుగులో ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ అని మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ లో.. హీరో సింహ ఒక హై సెక్యూరిటీ సిస్టమ్ కలిగున్న ‘కారు’లోని వస్తువులని దొంగలించడానికి రోడ్ పక్కన పార్క్ చేసి ఉన్న కారు ఎక్కుతాడు. అయితే హీరో కారు ఎక్కిన తరువాత కారు డోర్స్ లాక్ అయిపోయి లోపల చిక్కుకుపోతాడు.
ఆ కారు నుంచి బయటపడే ప్రయత్నంలో హీరోకి కారు లోపల ఒక బాంబు కనిపించడం, హీరో ఆ బాంబు పేలే లోపల ఎలా బయటపడ్డాడు అనే క్యూరియాసిటీని పెంచే కథాంశంతో రాబోతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక హీరో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కారులోనే ఉండనట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది. సెప్టెంబర్ 23న విడుదల కాబోతున్న ఈ సినిమాని ‘గురు ఫిల్మ్స్’ మరియు ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మిస్తుండగా, కొత్త డైరెక్టర్ సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు.