డా.రాజశేఖర్ హెల్త్ అప్‌డేట్.. ఇంతకుముందు కంటే బెటర్‌గా ఆరోగ్యం..

Rajasekhar Health Update: యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరూ ఇటీవల కరోనా బారిన పడ్డారు. కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకోగా జీవిత ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. రాజశేఖర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
తాజాగా రాజశేఖర్ ఆరోగ్యపరిస్థితికి సంబంధించి సిటీ న్యూరో సెంటర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
‘‘రాజశేఖర్ ఆరోగ్యం ఇంతకుముందు కంటే బెటర్‌గా ఉంది.. ప్లాస్మా థెరపి, సైటోసోర్బ్ డివైస్ థెరపీ చికిత్సనందింస్తున్నాం.. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’’ అని తెలిపారు.
డాక్టర్ రత్న కిషోర్, మెడికల్ డైరెక్టర్
సిటీ న్యూరో సెంటర్-హైదరాబాద్.