కల్కి ట్రైలర్ : ఏం సెప్తిరి, ఏం సెప్తిరి?

సినిమాపై అంచనాలు పెంచుతున్నడా.రాజశేఖర్ కల్కి కమర్షియల్ ట్రైలర్..

  • Published By: sekhar ,Published On : May 9, 2019 / 12:39 PM IST
కల్కి ట్రైలర్ : ఏం సెప్తిరి, ఏం సెప్తిరి?

Updated On : May 9, 2019 / 12:39 PM IST

సినిమాపై అంచనాలు పెంచుతున్నడా.రాజశేఖర్ కల్కి కమర్షియల్ ట్రైలర్..

చాలాకాలం తర్వాత, గరుడవేగ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చాడు.. డా.రాజశేఖర్. ప్రస్తుతం.. అ! సినిమాతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కల్కి మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కల్కి ఫస్ట్ లుక్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 9న విడుదలైన మహేష్ బాబు మహర్షి సినిమాతో పాటు కల్కి కమర్షియల్ ట్రైలర్ ప్లే చేస్తున్నారు. రీసెంట్‌గా నేచురల్ స్టార్ నాని, కల్కి ట్రైలర్‌ని ఆన్ లైన్‌లో రిలీజ్ చేసాడు. భగవద్గీత శ్లోకంతో కల్కి ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఏం సెప్తిరి, ఏం సెప్తిరి.. ఎప్పుడూ ఇలాగే సెప్తారా? అంటూ.. రాజశేఖర్ తన స్టైల్ మాడ్యులేషన్‌లో చెప్పడం అదిరిపోయింది.

ట్రైలర్ చివర్లో (గబ్బర్ సింగ్‌లో రాజశేఖర్‌ని ఇమిటేట్ చేసిన వ్యక్తి) రాజశేఖర్‌ని ఇమిటేట్ చేస్తుంటే, రాజశేఖర్ కూడా అలానే చేసి, ఏంట్రా ఇది.. అంటూ కొట్టడం లాంటికి ఆయన నుండి ఎక్స్‌పెక్ట్ చెయ్యలేం.. బట్, కొత్తగా ట్రైచేసి ఆకట్టుకున్నాడు.. ట్రైలర్‌లో, ప్రశాంత్ వర్మ టేకింగ్, దాశరథి శివేంద్ర ఫొటోగ్రఫీ, శ్రవణ్ భరద్వాజ్ ఆర్ఆర్, యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటన  హైలెట్ అయ్యాయి.. సినిమాపై అంచనాలు పెంచేలా ఉందీ ట్రైలర్..

హ్యాపీ మూవీస్, శివాని, శివాత్మిక మూవీస్ బ్యానర్స్‌పై, సి.కళ్యాణ్ అండ్ రాజశేఖర్ కూతుళ్ళు శివాని, శివాత్మిక నిర్మిస్తున్నారు. ఆదాశర్మ, నందితా శ్వేత, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు నటిస్తున్న ఈ మూవీకి  ఎడిటింగ్ : గౌతమ్ నెరుసు, లిరిక్స్ : కృష్ణకాంత్, ఆర్ట్ : నాగేంద్ర, ఫైట్స్ : నాగ వెంకట్, రాబిన్-సుబ్బు, నందు.

వాచ్ కల్కి ట్రైలర్..