లోకంలో లేదు : తాగి వాహనాలను ఢీకొట్టిన టీవీ నటి

ఆమె ప్రముఖ టీవీ నటి. సీరియల్స్ లో హవా నడుస్తోంది. హిందీ సీరియల్స్ చూసే ప్రతి ఒక్కరికీ సుపరిచితురాలు రూహీ శైలేష్ కుమార్ సింగ్. చీర కడితే సంప్రదాయానికే వన్నె తెస్తుంది ఈ నటి అంటారు అందరూ. ఈ బుల్లితెర నటికి ఓ అలవాటు ఉంది. షూటింగ్ అయిన తర్వాత పబ్స్ లో ఎంజాయ్. ఇదే ఇప్పుడు కొంప ముంచింది.
2019, ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. అర్థరాత్రి వరకు గంతులు వేసిన అమ్మడు.. ఆ తర్వాత తీరిగ్గా కారు తీసింది. తాగిన మైకంలో సొంతంగానే డ్రైవింగ్ చేసింది. ఇంకేముందీ.. స్పీడ్ తెలియలేదు. ముంబై నగర వీధుల్లో తప్పతాగి కారు నడిపింది ఓ టీవీ 30 ఏళ్ల రూహీ శైలేష్‌కుమార్ సింగ్.
కారుతో బీభత్సం చేసింది. శాంటాక్రాజ్ దగ్గర నాలుగు కార్లు, మూడు బైక్‌లను తన కారుతో ఢీకొట్టింది. ఆ వాహనాలు బాగా డ్యామేజ్ అయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. రూహీ శైలేష్ కుమార్ సింగ్ తాగిన మత్తుల్లో వాహనాలను ఢీకొట్టటమే కాకుండా.. ప్రశ్నించిన స్థానికులపై వాగ్వాదానికి దిగింది. నేను ఎవరో తెలుసా.. నాకు ఎవరు తెలుసో తెలుసా అంటూ గొప్పలకు పోయింది ఈ నటి. టీవీ నటి ఓవరాక్షన్ చేస్తున్నప్పుడు కొందరు వీడియో తీసి పోలీసులకు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో వాహనాలు మాత్రమే దెబ్బతిన్నాయి. ఎవరూ గాయపడలేదు. అదే విధంగా టీవీ నటి సింగ్ కారు కూడా దెబ్బతిన్నది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.