Dulquer Salmaan Interesting Comments on Lucky Baskhar movie and its Success
Dulquer Salmaan : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి, సీతారామం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమాని నిర్మించారు. దీపావళికి రిలీజయిన ఈ సినిమా ఇప్పటికే 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
తాజాగా దుల్కర్ సల్మాన్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో లక్కీ భాస్కర్ సినిమా ఎందుకు చేసాడో తెలిపాడు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. వెంకీ కథ చెబుతున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. బ్యాంకింగ్ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథ కొత్తగా అనిపించింది. నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలి అనుకున్నాను. అది ఈ సినిమాలో కనిపించడంతో ఈ పాత్ర చేశాను అని తెలిపారు.
Also Read : Sunny Leone : భర్తని రెండో సారి పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. మాల్దీవ్స్ లో పిల్లల సమక్షంలో పెళ్లి..
లక్కీ భాస్కర్ సినిమా, పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇది వాస్తవ కథ. బ్యాక్ గ్రౌండ్ లో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో ఎలాంటి స్కాం చేసాడు అని కొత్త పాయింట్. ఇది బ్యాంకింగ్ నేపథ్యం కావడంతో వెంకీ చాలా రీసెర్చ్ చేశాడు. బ్యాంకింగ్ సెక్టార్ కి చెందిన వాళ్ళు కూడా ఇందులో ఎలాంటి తప్పులు లేవని చెప్పారు. నటుడిగా అన్ని పాత్రలు చేయాలి. మనలోని నటుడ్ని బయటకు తేవాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలి. భాస్కర్ పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది అని తెలిపారు.
అలాగే.. మమ్ముట్టి గారి కొడుకుని అయినప్పటికీ నేనూ సాధారణ యువకుల్లాగానే ఆలోచిస్తాను. యువకుడిగా ఉన్నప్పుడు లాటరీ తగిలితే బాగుండు, డబ్బులు వస్తే నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని కలలు కనేవాడిని. మా నాన్న సినిమా చూసి నాతో ఏమి మాట్లాడలేదు కానీ వెంకీకి ఫోన్ చేసి అభినందించారు. నేను మా నాన్న ఇద్దరి కథలను చర్చించుకుంటాము. నేను తెలుగులోకి వస్తున్నప్పుడు ఆయనకు చెప్తే బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అన్నారని తెలిపారు.
ఇక తెలుగు ఆడియన్స్, తెలుగులో సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ప్లాన్ చేస్తే విజయాలు రావు. అందరం మంచి కథలు చెప్పాలి, మంచి సినిమాలు చేయాలనే అనుకుంటాం. కష్టానికి తగ్గ ఫలితం దక్కడం సంతోషంగా ఉంది. అందుకే మూడు సినిమాలు హిట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి మొదట ఆశ్చర్యపోయాను. మహానటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు అని అన్నారు.
ఇక ఇటీవల దుల్కర్ బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు నిజంగానే అన్ స్టాపబుల్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టం. బాలకృష్ణ గారు ఆ షూటింగ్ రోజు 12 గంటలకు పైగా షూటింగ్ లో పాల్గొన్నారు. మాకు నీరసం వచ్చినా ఆయన చివరివరకు అదే ఎనర్జీతో ఉన్నారు అని అన్నారు.