Sunny Leone : భర్తని రెండో సారి పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. మాల్దీవ్స్ లో పిల్లల సమక్షంలో పెళ్లి..
తాజాగా సన్నీ లియోన్ తన భర్త డానియల్ వెబర్ ని రెండో సారి పెళ్లి చేసుకుంది.

Sunny Leone Married her Husband Daniel Weber foe Second Time in Maldives
Sunny Leone : ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇక్కడ ఇండియాలో సెటిల్ అయి బాలీవుడ్ తో పాటు వివిధ సినీ పరిశ్రమలలో యాక్టర్ గా, డ్యాన్సర్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. సన్నీ లియోన్ డానియల్ వెబర్ ని 2011లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా, ఓ కూతురిని దత్తత తీసుకున్నారు. సన్నీ లియోన్, డానియల్ వెబర్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇండియన్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకొని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తారు.
తాజాగా సన్నీ లియోన్ తన భర్త డానియల్ వెబర్ ని రెండో సారి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన 13 ఏళ్ళ తర్వాత తమ పిల్లల ముందు మాల్దీవ్స్ లో ఈ జంట మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి సమయంలో చేసుకున్న ప్రమాణాలను మళ్ళీ గుర్తుచేసుకొని మిగిలిన జీవితాన్ని కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని ఈ పెళ్లి చేసుకున్నారట.
మాల్దీవ్స్ లో డానియల్ వెబర్, సన్నిలియోన్ మళ్ళీ పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేసి.. మొదటి సారి మా పెళ్లి దేవుడు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగింది. ఇప్పుడు మేము అయిదుగురమే ఉన్నాము. నువ్వు ఇప్పటికి, ఎప్పటికి నా లవ్ అంటూ డానియల్ వెబర్ ని ట్యాగ్ చేసింది సన్నీ. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.