King of Kotha : కింగ్ అఫ్ కోత ట్రైలర్ రిలీజ్.. దుల్కర్ సల్మాన్ మాస్ యాక్షన్ వయోలెన్స్..

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మాస్ యాక్షన్ సినిమా కింగ్ అఫ్ కోత (King Of Kotha) పాన్ ఇండియా వైడ్ ఆగస్టులో రిలీజ్ కాబోతుంది. తాజాగా కింగ్ అఫ్ కోత సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

King of Kotha : కింగ్ అఫ్ కోత ట్రైలర్ రిలీజ్.. దుల్కర్ సల్మాన్ మాస్ యాక్షన్ వయోలెన్స్..

Dulquer Salmaan King of Kotha Trailer Released

Updated On : August 10, 2023 / 10:34 AM IST

King of Kotha Trailer : మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మాస్ యాక్షన్ సినిమా కింగ్ అఫ్ కోత (King Of Kotha) పాన్ ఇండియా వైడ్ ఆగస్టులో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అభిలాష్ జోషి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజయిన పోస్టర్స్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా కింగ్ అఫ్ కోత సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కోత అనే ఒక ఊరికి దుల్కర్ ఒక నియంతలా ఎదిగి మళ్ళీ పడిపోయి కోత తన చేతిలోంచి జారిపోయాక ఎలా తిరిగి తీసుకున్నాడు అనేది కథ అని తెలుస్తుంది. మొదటిసారి దుల్కర్ ఈ రేంజ్ మాస్ యాక్షన్ వయోలెన్స్ సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rajinikanth : రజినీకాంత్ పంచ్ డైలాగ్.. వైసీపీ నాయకులకేనా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో దుల్కర్ కింగ్ అఫ్ కోత సినిమా ఈ ఆగస్టులో రిలిజ్ కాబోతుంది. దుల్కర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.