King of Kotha Twitter Review : కింగ్ అఫ్ కొత్త.. ట్విట్టర్ రివ్యూ.. దుల్కర్ యాక్షన్ ఎలా ఉంది?

ఇప్పటికే పలుచోట్ల మొదటి షో పడగా సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ కింగ్ అఫ్ కొత్త రివ్యూలని సోషల్ మీడియాలో తెలియచేస్తున్నారు.

Dulquer Salmaan King of Kotha Twitter Review and Audience Rating

King of Kotha Twitter Review : మలయాళం(Malayalam) స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగులో కూడా మహానటి, సీతారామం(Sita Ramam) సినిమాలతో హిట్స్ కొట్టి మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు కింగ్ అఫ్ కొత్త(King of Kotha) సినిమాతో పాన్ ఇండియా భాషల్లో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు దుల్కర్.

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi) జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ అఫ్ కొత్త నేడు ఆగస్టు 24న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దుల్కర్ మొదటిసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 2500 థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని థియేటర్స్ లో రిలీజయిన మొదటి మలయాళీ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి దుల్కర్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే పలుచోట్ల మొదటి షో పడగా సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ రివ్యూలని సోషల్ మీడియాలో తెలియచేస్తున్నారు.