Dulquer Salmaan : దీపావళి బరిలో దుల్కర్ సల్మాన్.. తెలుగులో హ్యాట్రిక్ కొడతాడా?

త్వరలో దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' సినిమాతో రాబోతున్నాడు.

Dulquer Salmaan Lucky Baskhar New Release Date Announced

Dulquer Salmaan : మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇపుడు అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు మీద ఫోకస్ చేసి ఇక్కడ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మహానటి, సీతారామం డైరెక్ట్ తెలుగు సినిమాలతో హిట్స్ కొట్టాడు. ఇటీవల కల్కిలో కూడా గెస్ట్ రోల్ లో మెప్పించాడు. త్వరలో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమాతో రాబోతున్నాడు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాని మొదట సెప్టెంబర్ 7న అనుకున్నారు. తాజాగా లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : Indra – Chiranjeevi : ‘ఇంద్ర’ రీ రిలీజ్‌కు మెగాస్టార్ ప్రమోషన్స్.. ఇంద్రసేనా రెడ్డి అంటూ..

లక్కీ భాస్కర్ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. పీరియాడికల్ స్టోరీగా ఓ బ్యాంక్ ఎంప్లాయ్ కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమాతో డైరెక్ట్ తెలుగులో దుల్కర్ హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి. అయితే దీపావళికి తెలుగులో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.