Indra – Chiranjeevi : ‘ఇంద్ర’ రీ రిలీజ్‌కు మెగాస్టార్ ప్రమోషన్స్.. ఇంద్రసేనా రెడ్డి అంటూ..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేస్తున్నారు.

Megastar Chiranjeevi Released a Special Video on Indra Movie Re Release
Indra – Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ విజయం సాధించిన సినిమాల్లో ఇంద్ర ఒకటి. ఈ సినిమా అప్పట్లో థియేటర్లు, కలెక్షన్స్ విషయంలో బోలెడన్ని రికార్డులు కలెక్ట్ చేసింది. ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న తరుణంలో ఇంద్ర సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. 2002 జులై 24న రిలీజయిన ఇంద్ర సినిమాని మళ్ళీ 22 ఏళ్ళ తర్వాత చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22న థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఇంద్ర రీ రిలీజ్ కు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేస్తున్నారు.
ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. ఇంద్ర.. ఇంద్రసేనా రెడ్డి అంటుంటూనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అంత పవర్ ఫుల్ సినిమా, అంత పెద్ద హిట్ అయిన సినిమా. అందుకు కారణం ఆ సినిమా కథ. ఆ సినిమాకి పనిచేసిన వారందరు ప్రాణం పెట్టి పనిచేసారు. ఆ సినిమాని చూడటం మొదలుపెడితే మొత్తం అయ్యేదాకా ఆపము. నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న కమర్షియల్ సినిమా ఇంద్ర. ఈ సినిమాలో అన్నీ పీక్స్ లో ఉంటాయి. కమర్షియల్ సినిమాకు పర్ఫెక్ట్ సినిమా ఇంద్ర. నిర్మాత, నాకు నచ్చిన వ్యక్తి అశ్వినీదత్, కథ అందించిన చిన్నికృష్ణ, డైలాగులు రాసిన పరుచూరి సోదరులు, అద్భుతమైన మ్యూజిక్ అందించిన మణిశర్మ గారు, ఆ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్, ఈ సినిమాని తెరకెక్కించిన మా బి.గోపాల్.. ఇలా అందరూ కలిసి ఈ సినిమాని అద్భుతంగా చెక్కి తెరకెక్కించారు. వారందరికీ నా ధన్యవాదాలు. 22 ఏళ్ళ తర్వాత ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నందుకు సంతోషంగా అంది. అప్పట్లాగే ఇప్పుడు కూడా అదే భావోద్వేగానికి లోనవుతున్నాను. ఈ జనరేషన్ కి కూడా ఈ సినిమా థియేట్రికల్ అనుభవం ఇవ్వడానికి మళ్ళీ మీ ముందుకు ఇంద్ర సినిమాని తీసుకు వస్తున్న స్వప్న దత్, ప్రియాంక దత్ కు నా కృతజ్ఞతలు. సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Indra Sena Reddy is back ???
Our dearest Megastar @KChiruTweets garu reflects on the journey of #INDRA and shares his excitement for the worldwide grand re-release on August 22nd. ?https://t.co/wdY0I7hZiE#Indra4K @AshwiniDuttCh #BGopal @iamsonalibendre #AarthiAgarwal… pic.twitter.com/gZWrBcBvV8
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 20, 2024