Sukumar – Allu Arjun : సుకుమార్ భార్య సినిమా కోసం రాబోతున్న బన్నీ, సుకుమార్.. ‘పుష్ప 2’ అప్డేట్ ఏమైనా ఇస్తారా?
స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా ఆగస్టు 23న రిలీజ్ కాబోతుంది.

Allu Arjun and Sukumar coming as Guests for Tabitha Sukumar Presenting Maruthinagar Subramanyam Movie
Sukumar – Allu Arjun : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న రావు రమేష్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. రావు రమేష్, అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్స్ పై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా ఆగస్టు 23న రిలీజ్ కాబోతుంది.
Also Read : Vishwak Sen : మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన విశ్వక్ సేన్.. రెండు నెలలకే అయిపోయిందా..?
ఇప్పటికే మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయి వైరల్ అయ్యాయి. ఇందులో హీరో అంకిత్ అల్లు అరవింద్ తన తండ్రి అని, అల్లు అర్జున్ నా అన్నయ్య అని చేసే కామెడీ, అల్లు అర్జున్ పాటల స్పూఫ్ లు బాగా వైరల్ అయ్యాయి. దీనికి తోడు సుకుమార్ భార్య ఈ సినిమాని దగ్గరుండి రిలీజ్ చేస్తుండటంతో మారుతి నగర్ సుబ్రమణ్యం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు.
“ICON STAR” @alluarjun Garu will grace the “BIGGEST PRE-RELEASE EVENT” for the biggest entertainer of the season, #MaruthinagarSubramanyam, making it truly “ICONIC“ ❤️?
Event on August 21st. Stay tuned for more details ??
In theatres from August 23 ❤?@thabithasukumar… pic.twitter.com/PO51EgQW4F
— Sukumar Writings (@SukumarWritings) August 19, 2024
మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం ఆగస్టు 21న హైదరాబాద్‌లో గ్రాండ్ గా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. దీంతో ఈ ఈవెంట్ పై, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
The #MaruthiNagarSubramanyam Pre-Release Event gets grander ??
Maverick Director @aryasukku garu will grace the event as a special guest ❤️?
Catch the 'ICONIC DUO' on one stage. On August 21st at Park Hyatt from 6 PM onwards ?
Book the special Premiere show tickets here!
?️… pic.twitter.com/qJo0KwHVWr— Sukumar Writings (@SukumarWritings) August 20, 2024
అయితే ఇటీవల అల్లు అర్జున్ ఏ ఈవెంట్ కి వచ్చినా పుష్ప 2 సినిమా గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. దీంతో ఈ సినిమా ఈవెంట్లో కూడా పుష్ప 2 సినిమా గురించి ఏమైనా మాట్లాడతాడా? ఏదైనా అప్డేట్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అసలే సినిమా వాయిదా పడింది, అందులోను సుకుమార్, బన్నీ కలిసి ఈవెంట్ కి వస్తుండటంతో పుష్ప 2 సినిమా గురించి కచ్చితంగా అప్డేట్ ఇస్తారని భావిస్తున్నారు ఫ్యాన్స్.