Dulquer Salmaan participated in Unstoppable with NBK S4
Unstoppable with NBK S4 : ఆహా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 గత వారం (అక్టోబర్ 25న) ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా వచ్చారు. ఫస్ట్ఎపిసోడ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక రెండో ఎపిసోడ్‌కు ఎవరు అతిథిగా వస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అతిథిగా వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన నటించిన మూవీ లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ నిర్మించాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అన్‌స్టాపబుల్ సీజన్ 4లో సినిమాను ప్రమోట్ చేసేందుకు దుల్కర్ సల్మాన్‌తో పాటు లక్కీభాస్కర్ టీమ్ హాజరైందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ పూరైనట్లు సమాచారం. ఇక బాలయ్య తనదైన శైలిలో పలు ప్రశ్నలు అడిగారట.
దుల్కర్ ఎలాంటి సమాధానాలు చెప్పాడు. బాలయ్య ఏ ఏ ప్రశ్నలు అడిగారో తెలుసుకునేందుకు రెండో ఎపిసోడ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.