Allu Arjun – Pushpa 2 : హైదరాబాద్‌లో 144 సెక్షన్.. నిరాశలో అల్లు అర్జున్ అభిమానులు.. పుష్ప 2 ఈవెంట్ లేనట్టేనా..?

తాజాగా హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేడు ప్రకటించారు.

Allu Arjun – Pushpa 2 : హైదరాబాద్‌లో 144 సెక్షన్.. నిరాశలో అల్లు అర్జున్ అభిమానులు.. పుష్ప 2 ఈవెంట్ లేనట్టేనా..?

Due to 144 Section in Hyderabad no Possibility for Allu Arjun Pushpa 2 Event

Updated On : October 28, 2024 / 3:15 PM IST

Allu Arjun – Pushpa 2 : తాజాగా హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేడు ప్రకటించారు. దీని ప్రకారం సభలు, సమావేశాలు, దర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నెల రోజుల పాటు హైదరాబాద్ లో నిషేధం. పబ్లిక్ ప్లేసెస్ లో ఐదుగురికి మించి గుమికూడినా చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

అయితే ఈ ఆంక్షలతో అల్లు అర్జున్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా కావడంతో దేశమంతా ప్రమోషన్స్ చేయనున్నారు. దీంతో నవంబర్ చివర్లోనే హైదరాబాద్ లో ఓ పబ్లిక్ ఈవెంట్ పెట్టాలనుకున్నారట పుష్ప టీమ్. ఇప్పుడు పోలీసులు 144 సెక్షన్ పెట్టడంతో ఆ ఈవెంట్ కి పర్మిషన్ రాదని భావిస్తున్నారు.

Also Read : Pawan Kalyan – Vijay : రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినందుకు.. తమిళ్ స్టార్ విజయ్‌ పై పవన్ కళ్యాణ్ ట్వీట్..

పుష్ప 2 కి భారీగానే ప్రమోషన్స్ చేస్తామని, హైదరాబాద్, ఏపీలో ఈవెంట్స్ పెడతామని నిర్మాతలు ఇటీవల తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయంలో హైదరాబాద్ లో మాత్రం పుష్ప 2 ఈవెంట్ ఉండకపోవచ్చు అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఒకవేళ హైదరాబాద్ లో ఈవెంట్ ఉంటే నవంబర్ 28 తర్వాత పెట్టుకోవాలి. మరి అప్పుడైనా ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్ కు పర్మిషన్ ఇస్తారా చూడాలి. లేక మొన్న దేవర లాగే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా పుష్ప 2 రిలీజ్ చేస్తారా చూడాలి.

Image