Pawan Kalyan – Vijay : రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినందుకు.. తమిళ్ స్టార్ విజయ్‌ పై పవన్ కళ్యాణ్ ట్వీట్..

నిన్న తన పార్టీ మొదటి బహిరంగ సభ పెట్టి తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు విజయ్.

Pawan Kalyan – Vijay : రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినందుకు.. తమిళ్ స్టార్ విజయ్‌ పై పవన్ కళ్యాణ్ ట్వీట్..

Pawan Kalyan Special Tweet on Tamil Star TVK Vijay

Updated On : October 28, 2024 / 2:17 PM IST

Pawan Kalyan – Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయనున్నాడు. అయితే నిన్న తన పార్టీ మొదటి బహిరంగ సభ పెట్టి తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. నిన్నటి విజయ్ TVK పార్టీ బహిరంగ సభకు ఏకంగా 5 లక్షలకు పైగా జనాభా వచ్చారు అని సమాచారం.

Also Read : Vijay – NTR : పార్టీ మొదటి సభలోనే.. సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన తమిళ్ స్టార్ విజయ్..

నిన్నటి సభతో విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా మొదలుపెట్టాడు. నిన్న సభలో కూడా తన స్పీచ్ తో అదరగొట్టాడు. అయితే విజయ్ కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియచేసారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా.. సాధువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినందుకు తిరు విజయ్ కు నా హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక గతంలో పవన్ సినిమాలు విజయ్, విజయ్ సినిమాలు పవన్ రీమేక్ లు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు గతంలో గొప్పగా మాట్లాడారు కూడా. ఇద్దరూ స్టార్ హీరోలుగా ఎదిగి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్లారు. మరి పవన్ కష్టపడి పాలిటిక్స్ లో సక్సెస్ అయినట్టే విజయ్ కూడా సక్సెస్ అవుతాడా చూడాలి.