Vijay – NTR : పార్టీ మొదటి సభలోనే.. సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన తమిళ్ స్టార్ విజయ్..
విజయ్ తన రాజకీయ పార్టీ తమిళ వెట్రి కజగం మొదటి భారీ బహిరంగ సభను తమిళనాడులోని విల్లుపురం అనే ఊరిలో ఏర్పాటుచేయగా..

Tamil Star Vijay Speak about NTR in his Party first Public Meeting
Vijay – NTR : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల కొన్ని నెలల క్రితం తమిళగ వెట్రి కజగం రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాను అని కూడా ప్రకటించారు విజయ్. అయితే ప్రస్తుతం విజయ్ తన లాస్ట్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా అవ్వగానే పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానని, సినిమాలు మానేస్తానని కూడా తెలిపాడు. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే తన పార్టీ మొదటి బహిరంగ సభ పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
నేడు విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం మొదటి భారీ బహిరంగ సభను తమిళనాడులోని విల్లుపురం అనే ఊరిలో ఏర్పాటుచేయగా దాదాపు 5 లక్షల మంది ఈ సభకు హాజరయ్యారని తెలుస్తుంది. ఈ సభలో విజయ్ తన పార్టీ గురించి, తన పార్టీ అజెండా, తాను ఏం చేయాలనుకున్నాడు, తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడాడు.
ఈ క్రమంలో విజయ్ మాట్లాడుతూ.. నా కెరీర్ పీక్ టైంలో ఉన్నప్పుడు సినిమాలు వదిలేసి మీ కోసం రాజకీయాల్లోకి వస్తున్నాను. నన్ను చాలా మంది సినిమా ఆర్టిస్ట్ అని విమర్శలు చేస్తున్నారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన MGR, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ లు కూడా ఆర్టిస్టులే అంటూ మాట్లాడారు. దీంతో తమిళనాడులో విజయ్ తన మొదటిసభలోనే మన ఎన్టీఆర్ పేరు తేవడంతో పలువురు తెలుగు వాళ్ళు, ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.