Dulquer Salman Samyuktha Nikhila Vimal Malayalam Movie Dubbed in Telugu
Dulquer Salman : మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మలయాళీ భామ సంయుక్త కూడా ఆతెలుగులో మంచి విజయాలు సాధిస్తుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి నటించిన మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులోకి డబ్బింగ్ అయింది.
దుల్కర్ సల్మాన్, సంయుక్త, నిఖిల విమల్.. కీలక పాత్రల్లో యంతో జోసెఫ్ నిర్మాణంలో నోఫాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళం సినిమా ఒరు యమండన్ ప్రేమకథ సినిమా 2019 లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులోఒక యముడి ప్రేమకథ టైటిల్ తో ఓటీటీలో రిలీజ్ అవుతుంది.
తెలుగు ఓటీటీ ఆహాలో ఒక యముడి ప్రేమకథ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమాని భవాని మీడియా రిలీజ్ చేసింది. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ఆహా ఓటీటీలో చూసేయండి.