Find Actor : గుర్రాన్ని గాల్లోకి ఎగిరించిన ఈ హీరోని గుర్తుపట్టారా? మొదటి సినిమా ఫ్లాప్.. స్టార్ యాంకర్ కొడుకు..
ఇంతకీ ఆ గుర్రాన్ని స్వారీ చేసేది ఎవరో, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టారా?

Do You Know this Hero who Riding Horse for Movie Photo goes Viral
Find Actor : మన హీరోలు సినిమాల్లో గుర్రపు స్వారీలు చేస్తారని తెలిసిందే. ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్.. ఇలా అన్ని జనరేషన్స్ లో చాలా మంది హీరోలు గుర్రాలపై స్వారీ చేసి మెప్పించినవారే. కొంతమంది అయితే బయట కూడా గుర్రాలపై స్వారీ చేస్తారు. ఈ కోవలో ఓ యువ హీరో కూడా గుర్రపు స్వారీ చేస్తున్నాడు. తాజాగా ఆ హీరో ఓ మూవీ కోసం గుర్రపు స్వారీ చేస్తూ గుర్రాన్ని గాల్లోకి ఎగిరించిన ఫోటోని మూవీ యూనిట్ షేర్ చేసింది. ఇంతకీ ఆ గుర్రాన్ని స్వారీ చేసేది ఎవరో, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టారా?
ఈ ఫొటోలో గుర్రాన్ని గాల్లోకి ఎగిరిస్తున్న హీరో రోషన్ కనకాల. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు. రోషన్ కనకాల గతంలో బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరాజయం పాలైంది. ఇప్పుడు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో మౌగ్లీ అనే సినిమా చేస్తున్నాడు రోషన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమాలో రోషన్ గుర్రపు స్వారీ చేస్తాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ రోషన్ గుర్రాన్ని గాల్లోకి ఎగిరించిన ఈ ఫోటోని షేర్ చేసారు.