Gatha Vaibhavam Review
Gatha Vaibhavam Review : ఎస్ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ జంటగా తెరకెక్కిన సినిమా గత వైభవం. సర్వేగర సిల్వర్ స్క్రీన్స్, సునీ సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సింపుల్ సునీ నిర్మాణంలో సింపుల్ సునీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా కన్నడలో గత వారం రిలీజయింది. తెలుగులో జనవరి 1న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందే ప్రీమియర్స్ వేశారు.(Gatha Vaibhavam Review)
ఆధునిక(ఆషికా రంగనాథ్) ఒక ఆర్టిస్ట్. ఓ వ్యక్తి బొమ్మ గీసి ఫేస్ బుక్ లో పెట్టి ఈ పోలికలతో ఉన్నవాళ్లెవరైనా ఉంటే కాల్ చేయండి అని పోస్ట్ చేస్తుంది. దీంతో ఆ బొమ్మ పురాతన(దుష్యంత్)వద్దకు వెళ్లడంతో అది నేనే అంటూ ఆధునికకు కాల్ చేస్తాడు. ఓ సారి కలుద్దాం అని చెప్పడంతో మొదట ఆలోచించినా సరే ఏమవుతుందో చూద్దాం అని పురాతన్ ఆధునిక ఉండే ఊరికి వెళ్తాడు.
ఆమెని కలిసాక మనిద్దరం జన్మజన్మల ప్రేమికులం, రెండు జన్మల్లో మనం విడిపోయాం, నాకు అన్ని గుర్తున్నాయి అని తమ గత జన్మల ప్రేమకథలు చెప్తుంది. పురాతన్ నమ్మకుండా తను ఆటపట్టించడానికి ఓ జన్మ కథ చెప్తాడు. మరి ఆధునిక చెప్పే జన్మజన్మల ప్రేమకథలు నిజమేనా? పురాతన్ కి అవి గుర్తొస్తాయా? అసలు ఆధునికకు ఎలా గుర్తొచ్చాయి? ఈ జన్మలో అయినా వీళ్ళు కలుస్తారా? అసలు ఆధునిక ఎవరు? పురాతన్ ఎవరు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Also Read : Psych Siddhartha Review : ‘సైక్ సిద్దార్థ’ రివ్యూ.. దరిద్రం అంతా వీడి లైఫ్ లోనే ఉందిగా..
గత కొన్నాళ్లుగా వాయిదా పడుతున్న ఈ గత వైభవం సినిమా కన్నడలో గత వారమే రిలీజయింది. అక్కడ యావరేజ్ గా నిలవగా తెలుగులో ఈ వారం రిలీజ్ చేస్తున్నారు. గత జన్మల్లో ప్రేమికులు విడిపోవడం ఈ జన్మలో కలవడం అనేవి ఆల్రెడీ చాలా సినిమాలు చూసాము. ఇది కూడా అలాంటి కథే.
ఫస్ట్ హాఫ్ సింపుల్ గా హీరోయిన్ ఓ బొమ్మ గీయడం, హీరో అది చూసి కలవడంతో మొదలవుతుంది. హీరో చెప్పిన ఓ జన్మ ప్రేమకథ, హీరోయిన్ చెప్పిన ఓ జన్మ ప్రేమకథ చాలా సిల్లీగా బోరింగ్ గా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ తొందరగానే ఆపేసి సెకండ్ హాఫ్ అయినా మంచి ప్రేమ కథ చూపిస్తారేమో అని ఎదురుచూసేలా చేసారు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక మంచి ప్రేమకథ చూపెట్టారు. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు బ్రిటిష్ కాలంలోని ఓ గ్రామీణ ప్రేమకథను అందంగా చూపించారు.
చివర్లో కాస్త ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది కానీ ఆ కథలో వచ్చే ట్విస్టులు అన్ని ఊహించేయొచ్చు. ఇక ప్రస్తుతానికి వచ్చాక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు మాత్రం ఊహించడం కాస్త కష్టమే. మొత్తానికి మనుషులు పోయినా ప్రేమ జన్మజన్మలు ఉంటుందనే రొటీన్ కాన్సెప్ట్ తో వివిధ జన్మల్లో ప్రేమకథలతో గత వైభవం చూపించారు. సినిమాలో ఓ చోట టైటిల్ ని డైలాగ్ గా వాడారు అది తప్ప గత వైభవం అని ఈ సినిమాకు టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. ఫస్ట్ హాఫ్ చాలా సిల్లీగా చూపించినా సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ప్రేమకథ వర్కౌట్ అయింది కాబట్టి పర్వాలేదనిపిస్తుంది. కామెడీ అక్కడక్కడా ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు.
దుష్యంత్ కి ఇది మొదటి సినిమా అయినా నాలుగు పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ బాగా నటించాడు. ఆషికా రంగనాథ్ ఎప్పుడో కెరీర్ ఆరంభంలో చేసిన సినిమా ఇది. ఆషికా కూడా నాలుగు పాత్రల్లో వేరియేషన్స్ చక్కగా చూపిస్తూ నటించి మెప్పించింది.
గ్రామీణ ప్రేమకథలో మాత్రం ఇద్దరూ ఒదిగిపోయారు అని చెప్పొచ్చు. గ్రామీణ ప్రేమకథలో భాస్కర్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Yash Rangineni : ‘ఛాంపియన్’ సినిమాలో విజయ్ దేవరకొండ మామయ్య.. ఈ ప్రొడ్యూసర్ గురించి తెలుసా..?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఎక్కడో విన్నాము అనిపించక మానదు. పైరేట్స్ ఆఫ్ కరేబియన్స్ మ్యూజిక్ ని కాస్త మార్చి వాడుకొని అది ఇన్స్పిరేషన్ అంటూ కౌంటర్ డైలాగ్ ముందే వేసుకోవడం గమనార్హం. ఎడిటింగ్ పరంగా మాత్రం ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్.
దర్శకుడు విడివిడిగా వివిధ కాలాల్లో ప్రేమకథలను రాసుకొని వాటిని కలుపుకొని ఓ కథగా మార్చి రొటీన్ గానే చూపించాడు అనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం అన్ని కాలాల్లోకి తగ్గట్టు లొకేషన్స్, వస్తువులు చూపెట్టడానికి బాగా కష్టపడ్డారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘గత వైభవం’ సినిమా జన్మజన్మలు మారినా ప్రేమ అలాగే ఉంటుంది అని చూపించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.