Psych Siddhartha Review : ‘సైక్ సిద్దార్థ’ రివ్యూ.. దరిద్రం అంతా వీడి లైఫ్ లోనే ఉందిగా..
సైక్ సిద్దార్థ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఈ సినిమానే తన జీవితం అని హోప్స్ పెట్టుకున్నాడు.(Psych Siddhartha)
Psych Siddhartha
Psych Siddhartha Review : నందు, యామిని భాస్కర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సైక్ సిద్దార్థ’. కీప్ రోలింగ్ పిక్చర్స్, నందునీస్ బ్యానర్స్ పై నందు, శ్యామ్ సుందర్ రెడ్డి నిర్మాణంలో వరుణ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాను జనవరి 1న రిలీజ్ చేస్తుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Psych Siddhartha)
కథ విషయానికొస్తే..
సిద్దార్థ్(నందు) త్రిష(ప్రియాంక రెబెకా) అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. సిద్దార్థ్ దగ్గర డబ్బులు తీసుకొని బిజినెస్ డెవలప్ చేస్తా అని మోసం చేసిన మన్సూర్ తో త్రిష వెళ్ళిపోతుంది. దీంతో డబ్బులు, ప్రేమించిన అమ్మాయి పోయి బాధతో, డబులు లేక ఎక్కడో బస్తీలో బికారిగా బతుకుతూ ఉంటాడు. శ్రావ్య(యామిని భాస్కర్) ఓ క్లాసికల్ డ్యాన్సర్. భర్త రోజూ కొడుతుండటం, టార్చర్ పెట్టడంతో తన కొడుకు రిషిని తీసుకొని భర్త నుంచి దూరంగా పారిపోయి సిద్దార్థ్ ఉండే ఇంటి కిందకు రెంట్ కి వస్తుంది.
సిద్దార్థ్ క్లోజ్ ఫ్రెండ్ రేవంత్ ప్రతిసారి అతనికి హెల్ప్ చేద్దామని వెళ్లి లాస్ అవుతూ ఉంటాడు. మరి శ్రావ్య – సిద్దార్థ్ పరిచయం ఎలా ఏర్పడింది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? సిద్దార్థ్ త్రిష, మన్సూర్ మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు? సిద్దార్థ్ మారాడా? సిద్దార్థ్ ఫ్రెండ్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also See : Dil Raju : దుబాయ్ లో దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. భార్య, కొడుకుతో కలిసి..
సినిమా విశ్లేషణ..
నందు ఎన్నో ఏళ్లుగా సినీ, టీవీ పరిశ్రమలో బిజీగా ఉన్నా హీరోగా సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. సైక్ సిద్దార్థ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఈ సినిమానే తన జీవితం అని హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా కూడా చేయడం గమనార్హం. కథ పరంగా చూస్తే ఇది చాలా రెగ్యులర్ కథే.
లైఫ్ లో అన్ని పోగొట్టుకొని దరిద్రంతో కాపురం చేసే ఒక అబ్బాయికి ఓ మంచి అమ్మాయి దొరికితే ఎలా మారాడు అనేదే కథ. అయితే దీన్ని ప్రస్తుత సమాజానికి, యూత్ కి కనెక్ట్ చేస్తూ సోషల్ మీడియా ని బాగా వాడుకొని ఎంటర్టైనింగ్ గా కాస్త అడల్ట్ గా చూపించారు.
ఫస్ట్ హాఫ్ అంతా సిద్దార్థ్ పాత్ర దరిద్రం, అతని కష్టాలు, గొడవలతో సాగుతుంది. మధ్య మధ్యలో శ్రావ్య పాత్ర పరిచయం అవుతుంది. ఇక ఇంటర్వెల్ కి శ్రావ్య సిద్దార్థ్ జీవితంలోకి రావడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ అంతా శ్రావ్య – సిద్దార్థ్ సన్నివేశాలు, సిద్దార్థ్ ఎలా మారాడు అని సాగుతుంది. క్లైమాక్స్ లో కొంత ఎమోషన్ వర్కౌట్ అయింది.
సినిమా అంతా స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేసి ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేసారు కాబట్టి రొటీన్ కథే అయినా ఇప్పటి యూత్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. అయితే ఇది A రేటెడ్ సినిమా, సినిమాలో కాస్త అడల్ట్ కామెడీ ఉండటంతో పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఆలోచించాల్సిందే. కొన్ని సీన్స్ మాత్రం మాటిమాటికి రిపీట్ మోడ్ లో చూపించి సాగదీసినట్టు అనిపించినా సినిమా మొత్తం నిడివి రెండు గంటలే కాబట్టి సింపుల్ గానే అయిపోయిందనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
నందు అయితే ప్రాణం పెట్టి చేసాడు అని తెలుస్తుంది. డిఫరెంట్ లుక్స్ తో కనిపించిన నందు కొన్ని చోట్ల లోదుస్తుల మీద కూడా అందరి ముందు నటించి మెప్పించాడు. మరి ఈ సినిమాలో నందు యాక్టింగ్ చూసి అయినా హీరోగా ఇంకొన్ని సినిమాలు వస్తాయేమో చూడాలి.
కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన యామిని భాస్కర్ ఒక కొడుక్కి తల్లి పాత్రలో, భర్త టార్చర్ అనుభవిస్తున్న భార్య పాత్రలో చాలా బాగా నటించింది. ప్రియాంక రెబెకా మోడ్రన్ అమ్మాయి పాత్రలో పర్వాలేదనిపించింది. నందు ఫ్రెండ్ పాత్రలో నటించిన ఇద్దరూ, మన్సూర్ పాత్ర చేసిన వ్యక్తి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ ప్రద్యుమ్న కూడా చాలా చక్కగా నటించాడు.
Also Read : Oona Chaplin : వార్ని.. ‘అవతార్’లో విలన్ చార్లీ చాప్లన్ మనవరాలా.. ఈమె గురించి తెలుసా?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా, ఎంటర్టైనింగ్ గా బాగుంది. సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. హీరో రూమ్, అతను ఉండే ప్లేస్ లో దరిద్రం చూపించడానికి చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడినట్టు కనిపిస్తుంది.
ఎడిటింగ్ ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ఎడిటింగ్ లోనే సినిమాను కొత్తగా ప్రజెంట్ చేసారు. పాత కథ తీసుకున్నా కొత్త స్క్రీన్ ప్లేతో ఎంటర్టైనింగ్ గా సినిమాని చూపించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘సైక్ సిద్దార్థ’ సినిమా అన్ని కోల్పోయి సైకోగా బిహేవ్ చేసే ఓ అబ్బాయి కథ. ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
