Movie Theaters Problems : థియేటర్స్ కష్టాలకు అసలు సమస్య అదే.. ‘పాప్ కార్న్’ రేటు సమస్యే కాదు.. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు కామెంట్స్..

తాజాగా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలపై మాట్లాడారు.

East Godavari Exhibitors Press Meet on Movie Theaters Problems

Movie Theaters Problems : గత కొన్నేళ్లుగా జనాలు థియేటర్స్ కి రావట్లేదని అంశం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దీనికి ఓటీటీలో త్వరగా రావడం, టికెట్ రేట్లు పెంచడం, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉండటం, పైరసీ, స్టార్ హీరోలు లేట్ గా సినిమాలు చేయడం.. ఇలాంటి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. థియేటర్స్ కి జనాలు లేక క్లోజ్ చేస్తున్నామని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య పర్శంటేజ్ విధానం ఇష్యూ కొనసాగుతుంది. ఈ ఇష్యూ పెద్దదయి ఏపీ ప్రభుత్వంవరకు వెళ్లడం, నిర్మాతలు మీటింగ్స్ పెట్టడం జరిగాయి. తాజాగా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలపై మాట్లాడారు. దీంట్లో భాగంగా ఓ రెండు అంశాలను ప్రస్తావించి వాటివల్ల థియేటర్స్ కి సమస్యలు అని తెలిపారు.

Also Read : Maargan Trailer : విజయ్ ఆంటోని ‘మార్గన్’ ట్రైలర్ రిలీజ్.. మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్.. విలన్ ఎవరో ఎలుసా?

ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. టికెట్ రేట్లు పెరగడమే సమస్య. టికెట్ రేట్లు పెద్దగా ఉన్నాయనే ప్రజలు రావట్లేదు. టికెట్ రేట్లు తగ్గగానే జనాలు వస్తున్నారు. మా రెవెన్యూ పెరుగుతుంది. అసలు పాప్ కార్న్ రేట్లు సమస్య కాదు. సింగిల్ థియేటర్స్ లో పాప్ కార్న్ 20 రూపాయలు ఉంటుంది. దానికి ఓ 10, 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది అంతే. జనాలు ఇక్కడ తినకపోతే బయట తింటారు. కానీ టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే థియేటర్ కి రావట్లేదు అని అన్నారు.

అలాగే.. పెద్ద హీరోలు రెగ్యులర్ గా సినిమాలు చేయాలి. సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు చేయాలి. పెద్ద హీరోల సినిమాలు వస్తే థియేటర్లకు జనాలు వస్తారు. హీరోలు రెగ్యులర్ గా సినిమాలు చేస్తే అసలు మాకు సమస్యలే ఉండవు అని అన్నారు. ఇటీవల ఏ సినిమా వచ్చిన టికెట్ రేట్లు పెంచుకోవాలని నిర్మాతలు చూస్తున్నారు. మరి ఈ అంశాలను టాలీవుడ్ పరిగణలోకి తీసుకుంటుందా చూడాలి.

Also Read : Aa Naluguru : థియేటర్స్ బంద్ ఇష్యూ.. ‘ఆ నలుగురు’ ఎవరో చెప్పేసిన జనసేన నేత.. ఆ నలుగురు టాలీవుడ్ నిర్మాతలే..