Aa Naluguru : థియేటర్స్ బంద్ ఇష్యూ.. ‘ఆ నలుగురు’ ఎవరో చెప్పేసిన జనసేన నేత.. ఆ నలుగురు టాలీవుడ్ నిర్మాతలే..

నేడు అత్తి సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురు ఎవరో, థియేటర్స్ బంద్ ఎవరు చేయాలనుకున్నారో చెప్పేసారు.

Aa Naluguru : థియేటర్స్ బంద్ ఇష్యూ.. ‘ఆ నలుగురు’ ఎవరో చెప్పేసిన జనసేన నేత.. ఆ నలుగురు టాలీవుడ్ నిర్మాతలే..

Janasena Leader Atti Satyanarayana Comments on Aa Naluguru who behind Theaters Bundh Issue

Updated On : May 28, 2025 / 3:08 PM IST

Aa Naluguru : నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య పర్శంటేజ్ విధానం కోసం కొన్ని రోజులుగా గొడవ సాగుతుంది. థియేటర్స్ నడపలేమని, పర్శంటేజ్ విధానంలో సినిమాలు ఇమ్మని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. కానీ నిర్మాతలు పాత రెంట్ విధానమే ఇస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ బంద్ చేస్తారని వార్తలు వచ్చాయి. దీని వెనక టాలీవుడ్ కి చెందిన ఓ నలుగురు నిర్మాతలు ఉన్నారని, వాళ్ళే థియేటర్స్ బంద్ కి ప్లాన్ చేసారని, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వచ్చేటప్పుడే కావాలని బంద్ ప్లాన్ చేసారని ఆరోపణలు వచ్చాయి.

దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పై, థియేటర్స్ పై సీరియస్ అయ్యారు. ఆ నలుగురు ఎవరా అని టాలీవుడ్ లో, బయట చర్చగా మారింది. పలువురు నిర్మాతలపై ఆరోపణలు రాగా అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ మీట్స్ పెట్టి ఆ నలుగురిలో మేము లేము మమ్మల్ని కలపద్దు అన్నారు. అయితే దిల్ రాజు ఈ థియేటర్స్ ఇష్యూ అంతా ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత, రాజమండ్రి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ చేసాడు అని ఇండైరెక్ట్ గా ఆరోపించారు. దీంతో జనసేన పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది.

Also Read : Atti Satyanarayana : థియేటర్ల బందుకు తెరలేపింది దిల్ రాజు, సురేష్ బాబులే.. పవన్ నిర్ణయం బాధ కలిగించింది.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు..

ఈ క్రమంలో నేడు అత్తి సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురు ఎవరో, థియేటర్స్ బంద్ ఎవరు చేయాలనుకున్నారో చెప్పేసారు.

అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ.. థియేటర్ల బందుకు తెరలేపింది దిల్ రాజు, సురేష్ బాబులే. దిల్ రాజు అతని తమ్ముడు శిరీష్ ను కాపాడుకునేందుకు నా మీద అభియోగం మోపారు. మా సమావేశంలో బంద్ అనే ప్రసక్తే ఎత్తలేదు. మేము సమావేశం పెట్టుకునే నాటికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. మాలాంటి వారిని అడ్డం పెట్టుకొని దిల్ రాజు నైజాం నవాబుగా ఏలుదాం అనుకుంటున్నాడు. దిల్ రాజు ప్రెస్ మీట్ లో సురేష్ బాబు, సునీల్ ఎందుకు లేరు? మూడు సెక్టార్లలో జూన్ 1 నుంచి బందు అని ప్రకటించింది శిరీష్ రెడ్డి. ఆ నలుగురు అంటే దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ అని ఆరోపించాడు.

Also Read : East Godavari Exhibitors : జనసేన నేత సస్పెండ్.. ఆయన తప్పేం లేదు.. మా సపోర్ట్ ఆయనకే అంటున్న ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు..

దీంతో అత్తి సత్యనారాయణ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. మరి అత్తి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నిర్మాతలు దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్, సురేష్ బాబు, ఏషియన్ సినిమాస్ సంస్థ సునీల్ స్పందిస్తారా లేదా చూడాలి.

Janasena Leader Atti Satyanarayana Comments on Aa Naluguru who behind Theaters Bundh Issue