East Godavari Exhibitors : జనసేన నేత సస్పెండ్.. ఆయన తప్పేం లేదు.. మా సపోర్ట్ ఆయనకే అంటున్న ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు..

ఈ థియేటర్స్ ఇష్యూ అంతా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లే మొదలు పెట్టారని, అక్కడ అత్తి సత్యనారాయణ అనే అతనే ఈ ఇష్యూ పెద్దది చేసాడని ఆరోపణలు వచ్చాయి.

East Godavari Exhibitors Support to Janasena Suspended Leader Atti Satyanarayana

East Godavari Exhibitors : గత కొన్ని రోజులుగా థియేటర్స్ సమస్య నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య నలుగుతుంది. ఎగ్జిబిటర్లు పర్శంటేజ్ విధానంలోనే సినిమాలు ఆడిస్తామని అంటే, నిర్మాతలు పాత రెంట్ విధానమే కావాలని అంటున్నారు. ఈ వివాదం పెద్దదయి థియేటర్స్ బంద్ అని టాక్ రావడంతో ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం జరిగింది. ఈ ఘటనపై నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు లు ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడగా నేడు ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

ఈ థియేటర్స్ ఇష్యూ అంతా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లే మొదలు పెట్టారని, అక్కడ అత్తి సత్యనారాయణ అనే అతనే ఈ ఇష్యూ పెద్దది చేసాడని ఆరోపణలు వచ్చాయి. దిల్ రాజు కూడా పేరు చెప్పకుండా అతనే చేసాడని ప్రస్తావించారు. ఈ క్రమంలో అతను జనసేన అధినేత కావడంతో జనసేన పార్టీ ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్ అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత, రాజమండ్రి నగర ఇంచార్జ్ అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో నేడు ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టారు.

Also Read : Movie Theaters Issue : హీరోలు అందరూ ఆ పని చేసి మమ్మల్ని బతికించండి.. చేతులెత్తి దండం పెడుతున్నాం.. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు..

ఈ ప్రెస్ మీట్ లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ.. సత్యనారాయణ గారు ఇండివిడ్యుయల్ గా ఏం చేయలేదు. ఏం జరిగినా అసోసియేషన్ పరంగానే జరిగింది. మాకు హైదరాబాద్ కి సంబంధం లేదు. ఈస్ట్ గోదావరి థియేటర్స్ వరకే మాకు సంబంధం. మేము అసలు బంద్ అని అనలేదు, ప్రకటించలేదు. సత్యనారాయణ పాత్ర ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ రోజుకు రెండు షోలు మూసేస్తున్నాము. పర్శంటేజ్ విధానం ఇవ్వకపోతే ఇచ్చేవాళ్లకే సినిమాలు వేస్తాం లేకపోతే లేదు జూన్ 1 నుంచి అని చెప్పాము అంతే. సత్యనారాయణ పేరు చెప్పి ఇబ్బంది పెట్టారు. దానిని మేము ఖండిస్తున్నాము. మా ఎగ్జిబిటర్స్ అంతా ఆయనకు సపోర్ట్ చేస్తాము. ఆయన కష్టాల్లో మాకు సపోర్ట్ చేశారు. ఈ ఘటనలో ఆయన హస్తం ఏమి లేదు అని అన్నారు. మరి దీనిపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read : HariHara veeramallu : హరిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి ‘తార తార నా క‌ళ్లు’ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్‌..