HariHara veeramallu : హరిహర వీరమల్లు నుంచి ‘తార తార నా కళ్లు’ లిరికల్ సాంగ్ రిలీజ్..
హరి హర వీరమల్లు నుంచి తార తార నా కళ్లు అనే పాటను విడుదలైంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, పవర్ ఫుల్ ‘అసుర హననం’ సాంగ్స్ విడుదల చేయగా అవి ఎంతటి సంచలనాలను సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా.. ‘తార తార నా కళ్లు..’ అనే పాటను విడుదల చేసింది. నిధి తన అందాలతో ఆకట్టుకుంది. శ్రీ హర్ష లిరిక్స్ అందించగా లిప్సిక, ఆదిత్య పాడారు. ఎంఎం కీరణవాణి సంగీతాన్ని అందించారు.
Mirai Teaser : తేజ సజ్జా ‘మిరాయ్’ టీజర్.. గూస్ బంప్స్ అంతే..
బాలీవుడ్ నటుడు బాబి డియోల్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.