Mirai Teaser : తేజ సజ్జా ‘మిరాయ్’ టీజ‌ర్‌.. గూస్ బంప్స్ అంతే..

మిరాయ్ టీజ‌ర్ విడుద‌లైంది.

Mirai Teaser : తేజ సజ్జా ‘మిరాయ్’ టీజ‌ర్‌.. గూస్ బంప్స్ అంతే..

Mirai Teaser

Updated On : May 28, 2025 / 10:44 AM IST

‘హను-మాన్’ మూవీతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో తేజ స‌జ్జా. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం మిరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సూపర్ యోధా గా తేజ ఈ సినిమాలో కనిపిస్తాడు. రితీకా నాయ‌క్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మంచు మ‌నోజ్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, స్పెష‌ల్ గ్లింప్స్‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. తాజాగా ఈ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

జ‌ర‌బోయేది మార‌ణ‌హోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. క‌లియుగంలో పుట్టిన ఏ శ‌క్తి దీన్ని ఆప‌లేదు అని జ‌య‌రాం చెప్పిన డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. మంచు మ‌నోజ్ ఇర‌గ‌దీశాడు. తేజ స‌జ్జా యాక్టింగ్ అదిరిపోయింది. మొత్తంగా టీజ‌ర్ చూస్తుంటే గూస్ బంప్స్ వ‌స్తున్నాయి. సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది.

Nandini Rai : ‘వారసుడు’ సినిమా చేసినందుకు బాధపడ్డాను.. ఆ సినిమా ఎందుకు చేసావు అని అడిగారు..

ఈ చిత్రంలో శ్రియ‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రాం వంటి చాలా మంది స్టార్లు ఉన్నారు. శ్రీలంక‌లో చాలా సీన్లు షూట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మైథ‌లాజిక‌ల్ ట‌చ్ ఉన్న‌ట్లుగా టీజ‌ర్ బ‌ట్టి తెలుస్తోంది. టీజ‌ర్ ఆఖ‌రిలో హ‌నుమంతుడు వ‌స్తున్న‌ట్లుగా చూపించారు. .