Nandini Rai : ‘వారసుడు’ సినిమా చేసినందుకు బాధపడ్డాను.. ఆ సినిమా ఎందుకు చేసావు అని అడిగారు..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు నందిని రాయ్ ఇంటర్వ్యూ ఇవ్వగా వారసుడు సినిమా గురించి, తన గ్లామర్ రోల్స్ గురించి మాట్లాడింది.

Nandini Rai : ‘వారసుడు’ సినిమా చేసినందుకు బాధపడ్డాను.. ఆ సినిమా ఎందుకు చేసావు అని అడిగారు..

Nandini Rai Sensational Comments on Vaarasudu Movie

Updated On : May 27, 2025 / 7:16 PM IST

Nandini Rai : మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్ అయి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది నందిని రాయ్. సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసింది. బిగ్ బాస్ లో పాల్గొని ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు నందిని రాయ్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ సినిమా గురించి, తన గ్లామర్ రోల్స్ గురించి మాట్లాడింది.

నందిని రాయ్ మాట్లాడుతూ.. విజయ్ సర్ వారసుడు సినిమాలో నాది చిన్న రోల్ కాదు. నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ప్రకాష్ రాజు కూతురు పాత్ర, శ్రీకాంత్ ని రెచ్చగొట్టి ఫ్యామిలీని డివైడ్ చేయాలి. అవన్నీ షూటింగ్ కూడా చేసారు. అది ఒక మంచి క్యామియో పాత్ర. కానీ ఎడిటింగ్ లో చాలా సీన్స్ తీసేసారు. సినిమాలో 2 నిముషాలు కూడా లేదు నా పాత్ర. సినిమా రిలీజ్ అయ్యాక ఎందుకు ఆ సినిమా చేసావు అని ప్రశ్నలు వచ్చాయి. నేను ఏం చేయలేను. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను. నా పోస్టర్ కూడా సపరేట్ గా రిలిజ్ చేసారు. దాంతో పెద్ద పాత్ర అనుకున్నా. కానీ నేను ఊహించలేదు. ఆ సినిమా వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వారసుడు లాంటి పాత్రలు మళ్ళీ చేయను అని తెలిపింది.

Also Read : Nandini Rai : గోవాలో చేతబడి.. రెండేళ్లు డిప్రెషన్ లోనే ఉన్నాను.. హెల్త్ సమస్యలు.. బిగ్ బాస్ భామ ఎమోషనల్..

అలాగే తన గ్లామర్ రోల్స్ గురించి మాట్లాడుతూ.. ఇంకా నేను స్కిన్ షోలు ఇంక చేయను. అనకాపల్లి అనే మూవీలో బాగా బోల్డ్ చేశాను. అది చూసి మా అమ్మ, నాన్న తిడతారేమో. అదే లాస్ట్ నేను స్కిన్ షో చేయడం. అందరూ నన్ను ఐటెం సాంగ్స్, లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ ఉన్న సినిమాలు అడుగుతున్నారు. నేను డీ గ్లామర్ రోల్స్ చేయాలి. నాకు కథలు వస్తున్నాయి కానీ నచ్చట్లేదు అని తెలిపింది.