Nandini Rai : గోవాలో చేతబడి.. రెండేళ్లు డిప్రెషన్ లోనే ఉన్నాను.. హెల్త్ సమస్యలు.. బిగ్ బాస్ భామ ఎమోషనల్..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు నందిని రాయ్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ ఆసక్తికర విషయం తెలిపింది.

Nandini Rai gets Emotional while Tells about her bad Phase in Life
Nandini Rai : మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్ అయి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది నందిని రాయ్. సినిమాల్లో అంత గుర్తింపు రాకపోయినా బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో నందిని పాల్గొంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు నందిని రాయ్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
నందిని రాయ్ మాట్లాడుతూ.. 2017, 18 మధ్యలో నేను డిప్రెషన్ లో ఉన్నాను. ఆ రెండేళ్లు లైఫ్ లో మర్చిపోలేను. ఓ పక్క సినిమాల్లో సక్సెస్ అవ్వట్లేదని, ఒక సినిమా ఆగిపోయిందని బాధలో ఉన్నాను. వీటికి తోడు గోవాకు వెళ్ళినప్పుడు ఓ ఘటన జరిగింది.
గోవాలో ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు బీచ్ లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాను. వాటర్ లో ఒక క్లాత్ మాటిమాటికి నా కాలికి చిక్కుకుంటుంది. ఎన్నిసార్లు వదిలినా నాకు చిక్కుకుంటుంది. ఓపెన్ చేస్తే అందులో ఎవరికో చేతబడి చేసి రెండు బొమ్మలు సూదులు గుచ్చి ఉన్నాయి. అందులో పువ్వులు, ఎవరిదో జుట్టు ఉన్నాయి. ఆ షాక్ తో చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత మూడు రోజులు జ్వరంతో ఉన్నాను. దాని తర్వాత కొన్ని రోజులు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. చావు మీద భయం వచ్చింది. దాంట్లోంచి బయటకు రావడానికి ఆల్మోస్ట్ రెండేళ్లు పట్టింది. ఆ సమయంలో సినిమాలు వచ్చినా హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాయను, ఆ సినిమాలు చేస్తే ఇంకాస్త సక్సెస్ వచ్చేదేమో అని చెప్తూ ఎమోషనల్ అయింది.
Also Read : Kannappa : కన్నప్ప హార్డ్ డిస్క్ ‘చరిత’ దొంగతనం చేసిందంటూ మంచు విష్ణు పోస్ట్.. ‘చరిత’కు మనోజ్ థ్యాంక్స్..