Dil Raju : పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.. థియేటర్స్ లో ఫుడ్ ధరలు అందుబాటులోకి.. దిల్ రాజు లెటర్ వైరల్..

తాజాగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్తూ ఓ లెటర్ విడుదల చేసారు.

Dil Raju : పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.. థియేటర్స్ లో ఫుడ్ ధరలు అందుబాటులోకి.. దిల్ రాజు లెటర్ వైరల్..

Dil Raju Says Thanks to Pawan Kalyan Regarding Movie Theaters Issue

Updated On : May 27, 2025 / 5:45 PM IST

Dil Raju : ఇటీవల నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ జరుగుతుండగా ఆ వివాదం ఏపీ ప్రభుత్వం వరకు వెళ్ళింది. థియేటర్స్ బంద్ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టాలీవుడ్ పై, థియేటర్స్ పై సీరియస్ అయ్యారు. పవన్ కామెంట్స్ టాలీవుడ్ లో చర్చగా మారడంతో ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ మీట్స్ పెట్టి పలు అంశాలు మాట్లాడారు.

నేడు పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి, అధికారులతో మాట్లాడి థియేటర్స్ లో తినుబండారాలు రేట్లు, థియేటర్స్ బంద్, థియేటర్స్ లో శుభ్రత, టికెట్ రేట్లపై చర్చించారు.

Also Read : Kannappa : కన్నప్ప హార్డ్ డిస్క్ ‘చరిత’ దొంగతనం చేసిందంటూ మంచు విష్ణు పోస్ట్.. ‘చరిత’కు మనోజ్ థ్యాంక్స్..

ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్తూ ఓ లెటర్ విడుదల చేసారు. దిల్ రాజు తన లెటర్ లో.. సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం. అలాగే, థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి, ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత.

ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుంది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలి. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతాము. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడుతాం అని తెలిపారు.

Also Read : Manchu Vishnu : నాకెందుకు స్వామి ఈ పరీక్ష.. కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు పోస్ట్ వైరల్..

Dil Raju Says Thanks to Pawan Kalyan Regarding Movie Theaters Issue