Manchu Vishnu : నాకెందుకు స్వామి ఈ పరీక్ష.. కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు పోస్ట్ వైరల్..

నేడు కన్నప్ప సినిమా సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ ని దొంగతనం చేసారని, వారిపై ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేసారని వార్తలు వచ్చాయి. దీనిపై మంచు విష్ణు, అతని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ లో స్పందించింది.

Manchu Vishnu : నాకెందుకు స్వామి ఈ పరీక్ష.. కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు పోస్ట్ వైరల్..

Manchu Vishnu Reacts on Kannappa Hard Disk Theft Issue

Updated On : May 27, 2025 / 4:45 PM IST

Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప సినిమాతో జూన్ 27న రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్ తో ఈ సినిమాని బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. విష్ణు మాత్రం ఓ అద్భుతమైన సినిమా చేసాము, భారీ బడ్జెట్ సినిమా అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ లాంటి స్టార్స్ ఉండటంతో వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

నేడు కన్నప్ప సినిమా సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ ని దొంగతనం చేసారని, వారిపై ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేసారని వార్తలు వచ్చాయి. దీనిపై మంచు విష్ణు, అతని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ లో స్పందించింది.

Also Read : Pawan Kalyan : పవన్ సీరియస్.. థియేటర్ల బంద్ ఇష్యూ.. జనసేన నేత సస్పెండ్.. ఆ బాధ్యతల నుంచి కూడా తొలగింపు..

కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై స్పందిస్తూ.. కన్నప్పలోని రెండు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, కీలకమైన VFX వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ రవాణా సమయంలో దొంగిలించబడింది. ఈ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుండి మా ఆఫీస్ కి డెలివరీ అవ్వాలి. అయితే ఆ ప్యాకేజీని చట్టవిరుద్ధంగా అడ్డగించి రఘు అనే వ్యక్తి సంతకం చేసి తీసుకున్నాడు. చరిత అనే మహిళ సూచనల మేరకు అతను వ్యవహరించాడు. వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, ప్రతినిధులు కాదు. వాళ్ళు చేసింది దొంగతనం. పోలీసులకు ఫిర్యాదు చేసాం. దీని వెనుక ఉన్న వారు ఎవరు అనేది పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చాం. ఇది ఎవరు చేయించారో రహస్యం కాదు అందరికి తెలుసు. ఆ నేరస్థుడి ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది.

వాళ్ళు కన్నప్ప సినిమా విడుదలను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు అది కుదరకపోవడంతో ఇలా చేసారు. అలాగే విడుదల కాని 90 నిమిషాల ఫుటేజ్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని విశ్వసనీయ నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి ప్రతిస్పందనగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పరిశ్రమలోనే ఇటువంటి చౌకబారు వ్యూహాలను అమలు చేయడం నిరాశపరిచింది. ఇది దుష్ప్రవర్తన మాత్రమే కాదు ఇది విధ్వంసం, వ్యక్తిగత కక్షసాధింపు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న ఈ సమయంలో ఇంతటి స్థాయికి దిగజారడం తిరోగమనమే కాదు ఇది అవమానకరం.

Also Read : kannappa : మంచు విష్ణుకి భారీ షాక్‌.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో యువతి పరార్‌..

కన్నప్పను సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌గా మార్చడానికి నిబద్ధతతో పనిచేసిన మా బృందం, మా తారాగణం మరియు ప్రతి సాంకేతిక నిపుణుడితో మేము ఐక్యంగా ఉన్నాము. ఈ పిరికి ప్రయత్నాలకు మేము భయపడము. ఎప్పటిలాగే నిజం గెలుస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఏదైనా పైరేటెడ్ కంటెంట్ బయటపడితే దానిని ఆస్వాదించవద్దని, ప్రసారం చేయవద్దని మాకు అండగా నిలబడాలని ప్రజలను, మీడియాను కోరుతున్నాము అని తెలిపారు.

అలాగే.. జటాజూఠదారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ అంటూ మంచు విష్ణు ఈ ఘటనపై పోస్ట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఇండైరెక్ట్ గా విష్ణు మనోజ్ ఈ దొంగతనం చేయించాడు అనే విధంగా పోస్ట్ చేసాడు అన్న సంగతి తెలుస్తుంది. మరి దీనిపై మనోజ్ ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

Also Read : Sandeep Vanga – Deepika Padukone : సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకోన్.. అసలు సమస్య ఏంటి? సందీప్ ఫైర్.. దీపికని ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు..