kannappa : మంచు విష్ణుకి భారీ షాక్‌.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో యువతి పరార్‌..

క‌న్న‌ప్ప మూవీకి సంబంధించిన విలువైన స‌మాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయ‌మైంది

kannappa : మంచు విష్ణుకి భారీ షాక్‌.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో యువతి పరార్‌..

Manchu Vishnu kannappa movie hard disk missing

Updated On : May 27, 2025 / 10:37 AM IST

మంచు విష్ణుకి మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న న‌టిస్తున్న క‌న్న‌ప్ప చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. ఈ స‌మ‌యంలో క‌న్న‌ప్ప మూవీకి సంబంధించిన విలువైన స‌మాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయ‌మైంది. దీనిపై ఫిలింన‌ర‌గ్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. త‌మ అనుమ‌తి లేకుండా హార్డ్‌డ్రైవ్‌ను తీసుకెళ్లిన‌ట్లుగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల తెలిపిన వివ‌రాల మేర‌కు.. ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ప‌ని చేస్తున్నారు. క‌న్న‌ప్ప చిత్రానికి సంబంధించి కీల‌క‌మైన కంటెంట్ ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను డీటీడీసీ కొరియర్‌ ద్వారా ఫిలింనగర్‌లోని ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయానికి ముంబైలోని హైవ్‌ స్టూడియోస్ పంపించింది.

Sandeep Reddy Vanga : స్టోరీ మొత్తం లీక్ చేసినా భ‌య‌ప‌డ‌ను.. దీపికా పదుకోన్ పై సందీప్ రెడ్డి వంగా కౌంట‌ర్‌..?

ఇందుకు సంబంధించిన పార్శిల్ ఈ నెల 25న కార్యాల‌యానికి వ‌చ్చింది. ఈ పార్శిల్‌ను ఆఫీస్ బాయ్ ర‌ఘు అందుకున్నాడు. అత‌డు దాన్ని చ‌రిత అనే మ‌హిళకు ఇచ్చాడు.

కార్యాల‌య సిబ్బంది హార్డ్‌డ్రైవ్ విష‌యం గురించి ర‌ఘుని అడుగ‌గా అత‌డు చ‌రిత‌కు ఇచ్చిన‌ట్లు చెప్పాడు. అయితే.. ఆ హార్డ్ డ్రైవ్ తీసుకున్న‌ప్ప‌టి నుంచి ఆమె త‌ప్పించుకుని తిరుగుతూ ఉంది. ఇది ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. కాగా.. చరిత, రఘులు కావాలనే కొంతమంది ప్రమేయంతో తమ సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా తిరుగుతున్నారని విజ‌య్‌కుమార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.