Sandeep Vanga – Deepika Padukone : సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకోన్.. అసలు సమస్య ఏంటి? సందీప్ ఫైర్.. దీపికని ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు..
దీపికా పదుకోన్ స్పిరిట్ సినిమాలో నటించడానికి అనేక కండిషన్స్ పెట్టిందట.

Sandeep Vanga Vs Deepika Padukone Spirit Issue goes Viral in Bollywood and Tollywood
Sandeep Vanga – Deepika Padukone : సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించకపోయినా ఆమెనే ఫిక్స్ అని బాలీవుడ్, టాలీవుడ్ అందరికి లీక్ అయింది. అయితే ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకోన్ ని సందీప్ వంగ తప్పించాడని, దీపికానే తప్పుకుందని మొదట బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
దీపికా పదుకోన్ స్పిరిట్ సినిమాలో నటించడానికి అనేక కండిషన్స్ పెట్టిందట. మొదట కథ విన్న దీపికా ఓకే చెప్పింది. ఆ తర్వాత రోజుకి 8 గంటలు మాత్రమే షూటింగ్ కి సమయం ఇస్తానని, అందులో 6 గంటలు మాత్రమే షూట్ చేస్తానని చెప్పిందట. ఆల్మోస్ట్ 20 కోట్ల భారీ రెమ్యునరేషన్ అడగడంతో పాటు ప్రాఫిట్స్ లో కూడా వాటా అడిగిందట. ఇక తెలుగు డబ్బింగ్ సొంతగా చెప్పమని అడిగినా నో అని చెప్పిందట. అలాగే డైరెక్టర్ సందీప్ వంగ కొన్ని బోల్డ్ సీన్స్ చెప్తే మొదట స్టోరీ విన్నప్పుడు ఓకే చెప్పి ఆ తర్వాత చేయను అని చెప్పిందట, అలాగే తనతో పాటు 20 మందికి పైగా తన స్టాఫ్ వస్తారని, వాళ్ళందర్నీ కూడా మెయింటైన్ చేయాలని అడిగిందట… ఇలా పలు కారణాలతో సందీప్ వంగకు దీపికా మీద కోపం వచ్చి తీసేశాడని సమాచారం. అక్కడిదాకా బాగానే ఉంది.
Also Read : Pushpa : ‘పుష్ప’లో ఫహద్ ఫాజిల్ కోసం ఆ తెలుగు హీరోని అడిగారట.. కానీ..
అయితే దీపికాని సందీప్ వంగ తీసేసాడు అని వార్తలు వచ్చాక బాలీవుడ్ లో కొంతమంది సందీప్ మీద నెగిటివ్ ప్రచారం చేసారు. దీంతో సందీప్ వంగ యానిమల్ భామ త్రిప్తి దిమ్రిని స్పిరిట్ హీరోయిన్ గా అధికారికంగా అనౌన్స్ చేసాడు. దీంతో దీపికా పదుకోన్ పీఆర్ టీమ్, బాలీవుడ్ లో దీపికాకు అనుకూలంగా ఉండే మీడియా, కొన్ని సోషల్ మీడియా పేజీలు సందీప్ వంగని, త్రిప్తి దిమ్రిని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం, విమర్శలు చేయడం చేసారు. అలాగే దీపికా ఓ బాలీవుడ్ మీడియాకు స్పిరిట్ స్టోరీని తన పీఆర్ టీమ్ తో చెప్పించిందట.
దీంతో సందీప్ వంగకు కోపం వచ్చి సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ లో సందీప్ వంగ.. ఓ బాలీవుడ్ హీరోయిన్‌కు కథ చెప్పాను. వందశాతం నమ్మకంతోనే ఆమెకు కథను చెప్పాను. దర్శకులు నటీనటులకు స్టోరీ నెరేట్ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. దీంతో వారు స్టోరీని ఎవ్వరికి చెప్పకూడదు. కానీ సదరు హీరోయిన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి స్టోరీని లీక్ చేసారు. ఓ చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా? మీ స్త్రీ వాదం దీనినే సూచిస్తుందా? ఓ యువ హీరోయిన్‌ను ఎదగకుండా చేయడం, ఎంతో కష్టపడి రాసుకున్న కథను లీక్ చేయడం, ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే? నాకు సినిమానే ప్రపంచం. ఓ దర్శకుడిగా ఎన్నో సంవత్సరాలు ఎంతో కష్టపడి కథ రాసుకున్నాను. ఎప్పటికి మీరు దీన్ని అర్థం చేసుకోలేరు. కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేయండి, నేనేమీ భయపడను అంటూ ఫైర్ అయ్యాడు.
When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You've 'DISCLOSED' the person that you are….
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025
దీంతో సందీప్ వంగ ట్వీట్ వైరల్ అయి బాలీవుడ్, టాలీవుడ్ లో చర్చగా మారింది. సందీప్ ఇలా డైరెక్ట్ ట్వీట్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్, టాలీవుడ్ నెటిజన్లు దీపికా మీద ఫైర్ అవుతున్నారు. దీపికా స్పిరిట్ స్టోరీ లీక్ చేసిందని, ఇంకో హీరోయిన్ ని ఎదగనివ్వకుండా చేస్తుందని ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు కేవలం 6 గంటలు పని చేసి అంత రెమ్యునరేషన్ అవసరమా? తెలుగు సినిమాల్లో చేస్తూ తెలుగు డబ్బింగ్ చెప్పరా? సినిమా కథని ఎవరైనా లీక్ చేస్తారా అంటూ దీపికా మీద ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారంటే ప్రస్తుతం ట్విట్టర్ లో దీపికా పదుకోన్ ట్రెండ్ అవుతుంది.
అయితే బాలీవుడ్ లో దీపికా అనుకూల మీడియా, ముందు నుంచి సందీప్ వంగని విమర్శించే మీడియా మాత్రం ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయని, ఒక లిమిట్ దాటి మరీ సందీప్ బోల్డ్ సీన్స్ పెట్టాడని, అందుకు దీపికానే ఈ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం చేస్తున్నారు. అయితే సందీప్ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉంటాయని తెలిసిందే. నచ్చకపోతే సినిమా చేయడం మానేయాలి కానీ కథ లీక్ చేయడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. డైరెక్ట్ గా దర్శకుడే కథ లీక్ చేసారు అని చెప్పాడంటే ఈ వివాదం పెద్దగానే అయిందని తెలుస్తుంది. మరి దీనిపై దీపికా కానీ, ఆమె పీఆర్ టీమ్ కానీ అధికారికంగా స్పందిస్తారేమో చూడాలి. అయితే ఇదే సరైన సమయం అని సౌత్ స్టార్స్, డైరెక్టర్స్ ని నార్త్ లో విమర్శించే కొన్ని మీడియా సంస్థలు సందీప్ వంగ పై నెగిటివిటి ప్రచారం చేస్తున్నాయి.