Pushpa : ‘పుష్ప’లో ఫహద్ ఫాజిల్ చేసిన క్యారెక్టర్ కోసం ఆ తెలుగు హీరోని అడిగారట.. కానీ..
ఆ పాత్రకు మొదట మన టాలీవుడ్ హీరోని అనుకున్నారట.

Do You Know Tollywood Hero is first Option for Pushpa Fahadh Faasil Character
Pushpa : అల్లు అర్జున్ పుష్ప రెండు భాగాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ తో పాటు ఆ సినిమాలో అన్ని పాత్రలు బాగా వైరల్ అయి వారికి కూడా మరింత గుర్తింపు వచ్చింది. పుష్ప లో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ అదరగొట్టాడు. ఆ పాత్రకు అతనే పర్ఫెక్ట్ అనేలా నటించాడు.
అయితే ఆ పాత్రకు మొదట మన టాలీవుడ్ హీరోని అనుకున్నారట. కానీ తర్వాత అది పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేయడంతో మార్కెట్ కోసం మలయాళం స్టార్ ఫహద్ వద్దకు వెళ్లారట. ఈ విషయాన్ని ఆ తెలుగు హీరో స్వయంగా చెప్పాడు. ఇంతకీ ఆ తెలుగు హీరో ఎవరో కాదు నారా రోహిత్.
భైరవం మీడియా మీట్ లో నారా రోహిత్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో మొదట ఫహద్ ఫాజిల్ పాత్రకు నన్ను అడిగారు. అప్పుడు అది తెలుగు వరకే ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేసుకోవడంతో ఫహద్ గారిని తీసుకున్నారు అని తెలిపాడు.
గతంలో వరుస సినిమాలు చేస్తూ బాణం, సోలో, రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి.. లాంటి మంచి విజయాలు అందుకున్న నారా రోహిత్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి భైరవం సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా మే 30 న రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ నారా రోహిత్ ఈ విషయాన్ని తెలిపాడు.
Also Read : kannappa : మంచు విష్ణుకి భారీ షాక్.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో యువతి పరార్..