Kannappa : కన్నప్ప హార్డ్ డిస్క్ ‘చరిత’ దొంగతనం చేసిందంటూ మంచు విష్ణు పోస్ట్.. ‘చరిత’కు మనోజ్ థ్యాంక్స్..

కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు తన నిర్మాణ సంస్థ ద్వారా స్పందిస్తూ..

Kannappa : కన్నప్ప హార్డ్ డిస్క్ ‘చరిత’ దొంగతనం చేసిందంటూ మంచు విష్ణు పోస్ట్.. ‘చరిత’కు మనోజ్ థ్యాంక్స్..

Manchu Vishnu Kannapa Hard Disk Theft Issue Manchu Manoj Says Thanks to Charitha

Updated On : May 27, 2025 / 5:17 PM IST

Kannappa : గత కొంతకాలంగా మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు మంచు విష్ణు కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ దొంగతనం చేసారని, దీనిపై ఇప్పటికే మూవీ యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసారని వార్తలు వచ్చాయి.

అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు తన నిర్మాణ సంస్థ ద్వారా స్పందిస్తూ.. దాదాపు 90 నిమిషాల ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ ని దొంగలించారు. కన్నప్పలోని రెండు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, కీలకమైన VFX వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుండి మా ఆఫీస్ కి డెలివరీ అవ్వాలి. ఆ ప్యాకేజీని చట్టవిరుద్ధంగా అడ్డగించి రఘు అనే వ్యక్తి సంతకం చేసి తీసుకున్నాడు. చరిత అనే మహిళ సూచనల మేరకు అతను ఈ పని చేసాడు. వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, ప్రతినిధులు కాదు. వాళ్ళు చేసింది దొంగతనం, వాళ్లపై పోలీస్ కేసు పెట్టాం. ఇది ఎవరు చేయిస్తున్నారో తెలుసు అని పోస్ట్ చేసారు.

Also Read : Manchu Vishnu : నాకెందుకు స్వామి ఈ పరీక్ష.. కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు పోస్ట్ వైరల్..

దీంతో విష్ణు మనోజ్ పైనే ఆరోపణలు చేస్తున్నాడని అర్ధమవుతుంది. అలాగే చరిత, రఘు ఎవరు అని చర్చగా మారింది. అయితే రెండు రోజుల క్రితమే మంచు మనోజ్ చరిత అనే అమ్మాయికి స్టేజి మీదే థ్యాంక్స్ చెప్పాడు. మనోజ్ నటించిన భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది.

ఈ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడుతూ.. నా స్టాఫ్ ఎన్ని కష్టాలు వచ్చినా నా కోసం నిలబడ్డారు. చరిత థ్యాంక్స్ అమ్మ. అన్నిట్లో నువ్వు నిలబడ్డావు. ఒక ఆడదానివి అయినా మగాళ్లు సిగ్గుబడేలా నీతి, నిజాయితీ అంటే ఏంటో నిలబడి చూపించావు అని అభినందించాడు. ఇప్పుడు విష్ణు చరిత అనే అమ్మాయే ఇది చేసిందని చెప్పడంతో నిజంగానే మనోజ్ చేయించాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదా విష్ణు మనోజ్ దగ్గర పనిచేసే చరిత అనే అమ్మాయి మీద ఆరోపణలు చేస్తున్నాడా అని పలువురు సందేహిస్తున్నారు.

Also Read : kannappa : మంచు విష్ణుకి భారీ షాక్‌.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో యువతి పరార్‌..