Movie Theaters Issue : హీరోలు అందరూ ఆ పని చేసి మమ్మల్ని బతికించండి.. చేతులెత్తి దండం పెడుతున్నాం.. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు..
నేడు ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టారు.

East Godavari Exhibitors Requested Tollywood Heros
Movie Theaters Issue : గత కొన్ని రోజులుగా థియేటర్స్ సమస్య వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు పర్శంటేజ్ విధానంలోనే సినిమాలు ఆడిస్తామని, నిర్మాతలు పాత రెంట్ విధానమే కావాలని అంటున్నారు. ఈ వివాదం పెద్దదయి ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు లు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ మాట్లాడారు.
అయితే ఈ ఇష్యూ అంతా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లే మొదలు పెట్టారని, అక్కడనుంచే రాష్ట్రం అంతా పాకింది అని అంతా అంటున్నారు. ఈ ఘటనలో ఓ ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్ అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ జనసేన పార్టీ కావడంతో అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో నేడు ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టారు.
Also Read : Mirai Teaser : తేజ సజ్జా ‘మిరాయ్’ టీజర్.. గూస్ బంప్స్ అంతే..
ఈ ప్రెస్ మీట్ లో ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. హీరోలు అందరూ మూవీ ఆర్టిస్ట్ తరపున వచ్చి సినీ పరిశ్రమని, థియేటర్స్ ని, మమ్మల్ని బతికించండి. మీరు సంవత్సరానికి రెండు సినిమాలు చేయండి చాలు. మీకు దండం పెడతాను. మీరు రెగ్యులర్ గా సినిమాలు చేస్తే చాలు అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ సమస్యలు అన్ని మీరు రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడం వల్లే. నిర్మాతలు హీరోలతో కూర్చొని మాట్లాడాలి సినిమాలు ఎక్కువ చేయమని అని అన్నారు.
వాళ్ళు చెప్పింది కూడా నిజమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పాన్ ఇండియా మోజు వచ్చాక ఒక్కో హీరో సినిమాకు రెండు నుంచి మూడేళ్లు సమయం తీసుకుంటున్నారు. అదే పెద్ద హీరోలు ఫాస్ట్ గా సినిమాలు చేస్తే రెగ్యులర్ గా థియేటర్స్ లో సినిమాలు ఉంటాయి, జనాలు వస్తారు, అందరికి పని దొరుకుతుంది, రెవెన్యూ పెరుగుతుంది అని గతంలో పలువురు సినీ నిర్మాతలు కూడా అభిప్రాయపడ్డారు. మరి మన హీరోలు ఏం చేస్తారో చూడాలి.
Also Read : HariHara veeramallu : హరిహర వీరమల్లు నుంచి ‘తార తార నా కళ్లు’ లిరికల్ సాంగ్ రిలీజ్..