Betting Apps : బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ.. ఈ స్టార్స్ అంతా విచారణకు రావాల్సిందే.. ఎవరెవరు ఎప్పుడు?
బెట్టింగ్ యాప్ కేసులో రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు.

Betting Apps
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ని పోలీసులు, ఈడీ సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినిమా సెలబ్రిటీలతో పటు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేస్తూ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
బెట్టింగ్ యాప్ కేసులో రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. వీరంతా గతంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రచారం చేసారు. తాజాగా ఈ సెలబ్రెటీలకు విచారణకు రమ్మని ఈడీ నోటీసులు ఇచ్చారు.
రానా జూలై 23న విచారణకు రావాలని, ప్రకాష్ రాజ్ జూలై 30న విచారణకు రావాలని, మంచు లక్ష్మి ఆగస్ట్ 13న, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపించింది. మరి వీరంతా ఈడీ విచారణకు హాజరవుతారా చూడాలి.