Anirudh : ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్.. ఫ్యాన్స్ కి పండగే.. లీక్ చేసిన నిర్మాత..

కింగ్డమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రస్తావన రాగా ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Anirudh : ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్.. ఫ్యాన్స్ కి పండగే.. లీక్ చేసిన నిర్మాత..

Anirudh

Updated On : July 21, 2025 / 5:14 PM IST

Anirudh : విజయ్ దేవరకొండ ఒక మంచి హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో రాబోతున్నాడు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో, బ్రదర్ ఎమోషన్ తో కింగ్డమ్ సినిమా రానుంది. జులై 31న కింగ్డమ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు.

తాజాగా కింగ్డమ్ సినిమా నిర్మాత నాగవంశీ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో కింగ్డమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రస్తావన రాగా ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : AM Rathnam : అందరూ OG.. OG.. అని అరుస్తుంటే బాధగా ఉండేది.. హరిహర వీరమల్లు నిర్మాత కామెంట్స్..

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. అనిరుధ్ టైంకి అవుట్ పుట్ ఇస్తున్నాడు. రీసెంట్ గానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంత వర్క్ చూసాము, అదిరిపోయింది. ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉన్నాయి. హీరో – హీరోయిన్స్ సాంగ్, అన్నదమ్ముల సాంగ్, హీరో ఎలివేషన్ సాంగ్, ఇంకో సాంగ్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ లో హీరో ఎలివేషన్ సాంగ్ వస్తుంది. త్వరలో ఆ సాంగ్ రిలీజ్ చేస్తాము. కింగ్డమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుధ్ తో హీరో ఎలివేషన్ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇప్పించడానికి ప్లాన్ చేస్తున్నాము అని తెలిపారు.

దీంతో విజయ్ ఫ్యాన్స్, అనిరుధ్ ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ లకు మంచి డిమాండ్ ఉంది. తమిళనాడులో ఇప్పటికే పలు సినిమాలకు, విడిగా లైవ్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చాడు. త్వరలో రజినీకాంత్ కూలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు అని ప్రకటించారు. అయితే దానికన్నా ముందే కింగ్డమ్ సినిమా సాంగ్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందని నాగవంశీ చెప్పేసారు.

Also Read : Pawan Kalyan : రంగంలోకి దిగిన పవన్.. ఫ్యాన్స్ కి పండగే.. బ్యాక్ టు బ్యాక్ హరిహర వీరమల్లు ప్రెస్ మీట్స్.. ఎప్పుడు? ఎక్కడ?