Pawan Kalyan : రంగంలోకి దిగిన పవన్.. ఫ్యాన్స్ కి పండగే.. బ్యాక్ టు బ్యాక్ హరిహర వీరమల్లు ప్రెస్ మీట్స్.. ఎప్పుడు? ఎక్కడ?
పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఫుల్ గా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు.

Pawan Kalyan
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ జులై 24న రిలీజవ్వనుంది. అయిదేళ్ల పాటు పవన్ రాజకీయాలు, కరోనా వల్ల ఈ సినిమా సాగుతూ వచ్చింది. రిలీజ్ టైం దగ్గరికి పడినా పవన్ బిజీ వల్ల ప్రమోషన్స్ ఎక్కువగా చేయలేకపోతున్నారు అని కామెంట్స్ వచ్చాయి.
కేవలం నిధి అగర్వాల్ ఒక్కతే ప్రమోషన్స్ భుజాన వేసుకొని చేస్తుంది. మంచి సినిమా అయినా, అదిరిపోయే యాక్షన్ ఉన్నా సినిమా ప్రమోషన్ లేకపోతే జనాల్లోకి వెళ్లడం కష్టం ఈ రోజుల్లో. పవన్ ఈ సినిమాని పట్టించుకోవట్లేదని, నిర్మాతని వదిలేసాడని కూడా పలువురు కామెంట్స్ చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఫుల్ గా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు.
పవన్ కళ్యాణ్ నిర్మాతతో మాట్లాడి ప్రెస్ మీట్స్ పెట్టామన్నారు. డైరెక్ట్ గా తానే వస్తానని చెప్పారు. నేడు హైదరాబాద్ లో మీడియా మీట్ నిర్వహించారు హరిహర వీరమల్లు యూనిట్. ఈ మీట్ కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తన కెరీర్ లో మొదటిసారి మీడియా మీట్ కి హాజరయ్యారు పవన్ కళ్యాణ్. అలాగే నేడు రాత్రి హైదరాబాద్ శిల్పకళావేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
అలాగే రేపు జులై 22న మంగళగిరిలో ఒక ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆ తర్వాత వైజాగ్ లో జులై 23న ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మళ్ళీ సినిమా రిలీజయ్యాక జులై 24 సాయంత్రం హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్స్ అన్నిటికి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
అసలు తన సినిమాలకు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్ప ప్రమోషన్స్ కి రాని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం రంగంలోకి దిగి వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టడం, వాటన్నిటికీ హాజరు కాబోతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పొలిటికల్ బిజీలో ఉన్నా నిర్మాత ఏఎం రత్నం కోసం, ధర్మం మీద తీసిన ఒక మంచి సినిమా జనాల్లోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ఇలా రంగంలోకి దిగారని తెలుస్తుంది.