AM Rathnam : అందరూ OG.. OG.. అని అరుస్తుంటే బాధగా ఉండేది.. హరిహర వీరమల్లు నిర్మాత కామెంట్స్..
నేడు నిర్మాత ఏఎం రత్నం 10 టీవీతో మాట్లాడుతూ..

AM Rathnam
AM Rathnam : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా అయిదేళ్లుగా సాగడం, ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం, ఎక్కడా సినిమా గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడకపోవడంతో ఈ సినిమాపై గతంలో అసలు అంచనాలు లేవు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని అంతగా పట్టించుకోలేదు. ఈ సినిమా ఉన్నా దీని తర్వాత రాబోయే OG సినిమా కోసమే అరిచేవారు ఫ్యాన్స్. ఆ సినిమాపై భారీ హైప్ ఉంది.
కానీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు పవన్ డైరెక్ట్ గా మొదటిసారి సినిమా ప్రెస్ మీట్ కి రావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
నేడు నిర్మాత ఏఎం రత్నం 10 టీవీతో మాట్లాడుతూ.. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టండి అన్నారు. సినిమా చాలా గొప్పగా ఉంది, దాని హైప్ తెలియట్లేదు ఎవరికీ. నేనే వస్తాను, నేనే మాట్లాడతాను అన్నారు. కంటెంట్ ఆయనకు బాగా నచ్చింది. అలాగే నా గురించి కూడా వచ్చారు. ఇన్ని రోజులు ఆయన ఎక్కడా హరిహర వీరమల్లు గురించి మాట్లాడలేదు. ఆయన బయట ఎక్కడా ఏ సినిమా గురించి మాట్లాడలేదు. కానీ ఫ్యాన్స్ అందరూ OG.. OG.. అని అరుస్తున్నారు. మా సినిమా గురించి ఎపుడూ అరవలేదు. మా సినిమా గురించి కూడా అరిస్తే బాగుండు అనుకున్నాను. దానికి నేను ఫీల్ అయ్యాను. ఇవాళ ఆయనే వచ్చి సినిమా గురించి చెప్పడంతో ఇంకా హైప్ పెరిగింది అని అన్నారు.