Mahadev Betting App Case : బాలీవుడ్‌ని బెంబేలేత్తిస్తున్న మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్.. పలువురు స్టార్స్‌కు ఈడీ నోటీసులు..

తాజాగా బాలీవుడ్ లో ఈడీ(ED) నోటీసులు వైరల్ గా మారింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపిస్తుంది.

Mahadev Betting App Case : బాలీవుడ్‌ని బెంబేలేత్తిస్తున్న మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్.. పలువురు స్టార్స్‌కు ఈడీ నోటీసులు..

ED sends summons to some Bollywood Celebrities in Mahadev betting app case

Updated On : October 6, 2023 / 4:28 PM IST

Mahadev Betting App Case : బాలీవుడ్(Bollywood) ఎప్పడూ ఏదో ఒక సంచలనమైన సంఘటనలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా బాలీవుడ్ లో ఈడీ(ED) నోటీసులు వైరల్ గా మారింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపిస్తుంది.

మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనేది ఒక గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్. గతంలో ఈ యాప్ కి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేశారు. ఈ యాప్ అధినేతల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఇటీవల తన వివాహాన్ని దుబాయ్ లో 200 కోట్లతో ఘనంగా చేసుకున్నాడు. ఈ వివాహానికి టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, భారతి సింగ్, కృతి కర్బందా, నుశ్రుత్.. ఇలా అనేకమంది బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.

ఈ సంఘటన తర్వాత మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్ కూడా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దీనిపై ద్రుష్టి సారించి విచారణ జరుపుతుంది. ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో సంబంధం ఉన్నవాళ్ళకి, దీనికోసం ప్రమోట్ చేసిన వాళ్ళకి ఈడీ నోటీసులు పంపుతుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.

Also Read : Chicken Song : సగిలేటి కథ నుంచి చికెన్ సాంగ్ ని చూశారా? భలేగుంది.. చికెన్ కోసం మీసం తాకట్టు పెట్టి..

తాజాగా నేడు బాలీవుడ్ నటులు కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్.. లతో పాటు మరికొంతమంది మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో సంబంధం ఉన్న వాళ్లకి ఈడీ నోటీసులు పంపింది. దీంతో బాలీవుడ్ లో ఈ ఘటన సంచలనంగా మారింది. మరింతమంది బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఈ స్కామ్ లో నోటీసులు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. దీంతో బాలీవుడ్ లో ఇప్పుడు మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వైరల్ గా మారింది.