Shyam Singha Roy : ఏదో ఏదో తెలియని లోకమా.. తహ తహ మైకమా..

రీసెంట్‌గా రిలీజ్ చేసిన చేసిన ‘ఏదో ఏదో’ లిరికల్ సాంగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది..

Shyam Singha Roy : ఏదో ఏదో తెలియని లోకమా.. తహ తహ మైకమా..

Edo Edo Lyrical Song

Updated On : November 26, 2021 / 12:27 PM IST

Shyam Singha Roy: నాని కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్‌ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Nani : భార్యకు బర్త్‌డే విషెస్ భలే చెప్పాడుగా..

నాని.. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. టీజర్, టైటిల్ సాంగ్‌ ఆకట్టుకున్నాయి. గురువారం విడుదల చేసిన ‘ఏదో ఏదో’ లిరికల్ సాంగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మిక్కీ జె మేయర్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. చిత్ర అంబడిపూడి చక్కగా పాడారు.

Shyam Singha Roy : నాలుగు భాషల్లో నాని సినిమా

నాని, కృతి శెట్టిల పెయిర్ బాగుంది. సరికొత్త కథా కథనాలతో తెరకెక్కిన ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ‘వి’, ‘టక్ జగదీష్’ ఓటీటీలో వచ్చెయ్యడంతో ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కోసం నాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.