Ee Nagaraniki Emaindi : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మళ్లీ వచ్చేస్తోంది.. ఏ రోజునో తెలుసా..?
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల చిత్రాలను రీ రిలీజ్ చేయగా ఆ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంతో పాటు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో రాబట్టాయి. తాజాగా మరో చిత్రం రీ రిలీజ్‌కు సిద్దమైంది.

Ee Nagaraniki Emaindi Re-Release
Ee Nagaraniki Emaindi Movie : టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల చిత్రాలను రీ రిలీజ్ చేయగా ఆ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంతో పాటు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో రాబట్టాయి. తాజాగా మరో చిత్రం రీ రిలీజ్‌కు సిద్దమైంది. అదే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ పుల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’(Ee Nagaraniki Emaindi).
హీరో విశ్వక్ సేన్, అభినవ్, వెంకటేష్, సాయి సుశాంత్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2018లో జూన్ 29న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలంటూ చాలా మంది అడిగినప్పటికి ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఊసే లేదు. ఈ సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న క్రమంలో రీ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్దమైంది.
AAA Cinemas : అల్లు అర్జున్ కొత్త థియేటర్ AAA సినిమాస్ ఎలా ఉందో చూశారా? ఇంద్రభవనంకి మించి..
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ తెలియజేశారు. ‘ఈ నగరానికి ఏమైంది సినిమా వచ్చి ఐదు సంవత్సరాలు అవుతోంది. అయితే నాకు మాత్రం నిన్ననే వచ్చినట్లుగా ఉంది. మీరంతా కలిసి ఈ చిత్రాన్ని సక్సెస్ చేశారు. కానీ ఐదేళ్ల కాలంలో ఎంతో మారింది. నా ప్రతి రూల్ బ్రేకైంది. కింద పడిపోయా. మళ్లీ అన్నింటిని పునర్‌నిర్మించుకుంటూ వచ్చానని.’ తరుణ్ భాస్కర్ అన్నాడు.
View this post on Instagram
New Movie Opening : నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం
జూన్ 29 ఈ నగరానికి ఏమైంది సినిమాని రీ రిలీజ్ చేస్తున్నాము. కేవలం థియేటర్లలో మాత్రమే కాదని, ఎంపిక చేసిన క్లబ్, కెఫేలలో విడుదల చేయనున్నట్లు చెప్పాడు. దీనితో పాటు మీకో బహుమతిగా కీడా కోలా సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నాము. అందుకనే మీరు మరోసారి మిత్రులతో కలిసి ఈ సారి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అంటూ తరున్ చెప్పుకొచ్చాడు.
ఈ నగరానికి ఏమైంది సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించగా హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో కనిపించారు.