Egire Paavurama : 25 ఏళ్ల ‘ఎగిరే పావురమా’

శ్రీకాంత్, లైలా, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి తెరెక్కించిన బ్యూటిఫుల్ లవ్ అండ్ మ్యూజికల్ హిట్ ఫిలిం ‘ఎగిరే పావురమా’..

Egire Paavurama: శ్రీకాంత్, లైలా, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి తెరెక్కించిన బ్యూటిఫుల్ లవ్ అండ్ మ్యూజికల్ హిట్ ఫిలిం ‘ఎగిరే పావురమా’. శ్రీ స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో (స్రవంతి రవి కిషోర్), చంద్ర కిరణ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి. ఉషా రాణి నిర్మించారు.

NTR 30-Thalapathy Vijay : అనిరుద్ ఫిక్స్.. హెయిర్ స్టైలిష్‌తో విజయ్..

1997 జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎగిరే పావురమా’ 2022 జనవరి 30 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సుహాసిన, తనికెళ్ల భరణి, నిర్మలమ్మ, చరణ్ రాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ‘సల్లపం’ అనే మలయాళ చిత్రానికి రీమేక్.

Jr NTR-Mahesh Babu : సర్కారు వారి పాట షర్ట్స్.. జూనియర్ ఎన్టీఆర్ జీన్స్..

మలయాళ స్టార్ దిలీప్ హీరోగా, మంజు వారియర్ హీరోయిన్‌గా నటించగా.. పాపులర్ మలయాళీ యాక్టర్ మనోజ్ కె.జయన్ (గోపిచంద్ ‘శౌర్యం’ సినిమాలో విలన్) హీరోయిన్ మేనమామ క్యారెక్టర్ చేశారు. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

 

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన జ్యోతి (లైలా) ను తాగుబోతు తండ్రి పట్టించుకోడు. రైల్వేలో గ్యాంగ్ మెన్‌గా పనిచేసే మేనమాన (జె.డి. చక్రవర్తి) పెంచి పెద్ద చేస్తాడు. జ్యోతి అంటే మేనమామకి అంతులేని అభిమానం. ఆమెకు ఏ చిన్న లోటు కూడా రానివ్వడు. జ్యోతికి సంగీతమంటే చాలా ఇష్టం. తనకొచ్చే జీతం అంతతమాత్రమే అయినా జ్యోతి ఏమడిగినా కాదనకుండా ఇస్తాడు.

F10 : విన్ డీజిల్‌కి విలన్‌గా ‘ఆక్వామెన్’ హీరో..

చిన్న చిన్న కచేరీల్లో పాడుతూ.. తనను తాను జూనియర్ బాలసుబ్రహ్మణ్యంగా చెప్పుకునే బాలు (శ్రీకాంత్) చేత జ్యోతి మేనమామ కచేరీ ఏర్పాటు చేయిస్తాడు. తొలిచూపులోనే బాలు గాత్రానికి ముగ్దురాలవుతుంది జ్యోతి. బాలు కూడా జ్యోతి మీద మనసు పడతాడు.. ఇది తెలిసిన జ్యోతి మేనమామ ఏం చేశాడనేది మిగతా కథ. సినిమాకి ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.

 

ముఖ్యంగా నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్ల పనితనం సినిమాకు ప్లస్ అయ్యింది. మరుధూరి రాజా డైలాగ్స్, శరత్ సినిమాటోగ్రఫీ అందించారు. ముఖ్యంగా ఎస్.వి. కృష్ణా రెడ్డి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయింది. సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్‌లో కంపోజ్ చేశారాయన. 25 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ‘ఎగిరే పావురమా’..

Bro Daddy : హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘బ్రో డాడీ’..

ట్రెండింగ్ వార్తలు